ETV Bharat / sports

చెలరేగిన రబాడ- తడబడ్డ టీమ్ఇండియా- ఆదుకున్న రాహుల్ - ఇండియా వర్సెస్ సౌతాఫ్రికా తొలి టెస్టు స్కోర్

India Vs South Africa 1st Test :సౌతాఫ్రికా, భారత్ మధ్య జరుగుతున్న తొలి టెస్టులో తొలి రోజు ఆట ముగిసింది. వర్షం కారణంగా ఆ మ్యాచ్​ను 59 ఓవర్లకే అంపైర్లు రద్దు చేశారు. దీంతో ఆ సమయానికి టీమ్ఇండియా 8 వికెట్ల నష్టానికి 208 పరుగులు చేయగలిగింది.

India Vs South Africa 1st Test
India Vs South Africa 1st Test
author img

By ETV Bharat Telugu Team

Published : Dec 26, 2023, 9:24 PM IST

Updated : Dec 27, 2023, 6:11 AM IST

India Vs South Africa 1st Test : సౌతాఫ్రికాలోని సూపర్ స్పోర్ట్​ పార్క్​ వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టులో భారత జట్టు అత్యుత్తమ ఫామ్​ను కనబరచలేకపోయింది. టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమ్ఇండియా కగిసో రబాడ (5/44) విజృంభించడం వల్ల తొలి రోజు 59 ఓవర్లు ముగిసేసరికి 8 వికెట్ల నష్టానికి 208 పరుగులు చేయగలిగింది. మ్యాచ్​ జరుగుతున్న సమయంలో వర్షం పడటం వల్ల ఆటకు కాస్త బ్రేక్​ ఇచ్చారు. అయితే వాన తగ్గే సూచనలు కనిపించకపోవడం వల్ల ఇక మొదటి రోజు ఆటకు ముగింపు పలికారు అంపైర్లు.

ఇక టాప్ ఆర్డర్​లో వచ్చిన ఓపెనర్‌, కెప్టెన్ రోహిత్ శర్మ 5 పరుగులకే పెవిలియన్ బాట పట్టి అభిమానులను నిరాశపరిచాడు. ఆ తర్వాత యశస్వీ జైశ్వాల్‌ 17 పరుగులకు ఔటయ్యాడు. వెంటనే శుభ్​మన్ గిల్‌ (2) కూడా వెనుతిరిగాడు. అయితే విరాట్​ కోహ్లీతో కలిసి జట్టును ఆదుకుంటూ వచ్చిన శ్రేయస్ అయ్యర్ 31 పరుగులకే ఔటయ్యాడు. దీంతో టీమ్ఇండియాకు షాక్ తగిలింది. అయితే విరాట్ కోహ్లీ నిలకడగా ఆడుతుండటం వల్ల అభిమానులు కాస్త ఊపిరి పీల్చుకున్నారు. కానీ అనూహ్యంగా విరాట్ (38) కూడా క్రీజులో నిలవలేకపోయాడు.

మరోవైపు మిడిల్ ఆర్డర్‌లో మైదానంలోకి దిగిన కేఎల్ రాహుల్ 70 పరుగులతో అజేయంగా నిలిచాడు. అతడికి తోడుగా సిరాజ్ (0*) కూడా నాటౌట్‌గా ఉన్నాడు. మిగిలిన వారిలో శార్దూల్ ఠాకూర్ (24) కూడా జట్టుకు మంచి స్కోర్​ను అందించేందుకు ప్రయత్నించాడు. మరోవైపు సఫారీ బౌలర్లు కట్టుదిట్టంగా ఆడారు. నండ్రీ బర్గర్ 2, మార్కో జాన్సన్ ఒక వికెట్ పడగొట్టారు.

'జడ్డూ ఆడకపోవడానికి అదే కారణం'
Ravindra Jadeja South Africa Series : మరోవైపు బాక్సింగ్‌ డే టెస్టులో టాప్‌ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా బెంచ్‌కే పరిమితమయ్యాడు. దీంతో అతడికి ఏమైందో అంటూ అభిమానులు ఆందోళన వ్యక్తం చేశారు. అయితే, జడేజా ఆడకపోవడానికి గల కారణాలను కెప్టెన్ రోహిత్ శర్మ టాస్​ సమయంలో చెప్పాడు. " వెన్ను నొప్పిగా ఉందని జడేజా మా దృష్టికి తీసుకొచ్చాడు. అతడికి విశ్రాంతి ఇవ్వాలని మేం నిర్ణయించాం. తొలి టెస్టులో అతడు ఆడటం లేదు" అంటూ క్లారిటీ ఇచ్చాడు. ఇదే విషయాన్ని బీసీసీఐ కూడా వెల్లడించింది.

టీమ్ఇండియాకు వీళ్లే కీలకం!- సఫారీ గడ్డపై ఎవరి ప్రదర్శన ఎలా ఉందంటే?

భారత్xసౌతాఫ్రికా టెస్ట్​ సిరీస్- పరుగుల వరద పారించిన బ్యాటర్లు- టీమ్ఇండియాలో విరాట్ ఒక్కడే!

Last Updated : Dec 27, 2023, 6:11 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.