India vs Pakistan Super 4 Asia Cup 2023 : India vs Pakistan Super 4 Asia Cup 2023 : చిరకాల ప్రత్యర్థులు తలపడే పోరు కోసం పటిష్ఠ ఏర్పాట్లు చేసింది ఆసియా క్రికెట్ కౌన్సిల్. ఆసియా కప్ సూపర్ ఫోర్లో భాగంగా భారత్, పాకిస్థాన్ మధ్య జరిగే మ్యాచ్‌కు రిజర్వ్ డేను ప్రకటించింది. ఈ మ్యాచ్ సెప్టెంబర్ 10న శ్రీలంకలోని ప్రేమదాస ఇంటర్నేషనల్ స్టేడియంలో జరగనుంది. అయితే, వాతావరణ పరిస్థితుల దృష్ట్యా ఆటకు ఏదైనా ఆంటంకం ఏర్పడితే సెప్టెంబర్ 11న ఆగిపోయిన సమయం నుంచి మ్యాచ్ జరగనుంది.
అయితే, టోర్నీలోని ఇతర సూపర్ ఫోర్ మ్యాచ్‌లకు మాత్రం ఎలాంటి రిజర్వ్ డేను ప్రటించలేదు. టోర్నీ ఫైనల్‌కు మాత్రమే రిజర్వ్ డే ఉండగా.. తర్వాత భారత్, పాక్ మ్యాచ్‌కు మాత్రమే ఈ అవకాశాన్ని కల్పిచింది. ఒకవేళ మ్యాచ్ మధ్యలో ఆగిపోతే.. ప్రేక్షకలు తమ టికెట్లతో రిజర్వ్ డే మ్యాచ్‌కు రావొచ్చని చెప్పింది.
"ఆసియా కప్ సూపర్ ఫోర్లో భాగంగా జరిగే భారత్, పాక్ మ్యాచ్‌కు రిజర్వ్ డేను ఏర్పాటు చేశాం. సెప్టెంబర్ 10న శ్రీలంక కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలో మ్యాచ్ జరగనుంది. ఒకవేళ ఏదైనా వాతావరణ పరిస్థితుల దృష్ట్యా మ్యాచ్ ఆగిపోతే ఆ సమయం నుంచి సెప్టెంబర్ 11న తిరిగి మొదలవుతుంది"
-ఆసియా క్రికెట్ కౌన్సిల్
Asia Cup 2023 Super 4 IND VS PAK : అంతకు ముందు సెప్టెంబర్ 2న.. గ్రూప్ దశలో చిరకాల ప్రత్యర్థులు టీమ్ఇండియా-పాక్ (IND vs PAK) మధ్య మ్యాచ్.. వర్షం కారణంగా రద్దు అయింది. భారత్ ఇన్నింగ్స్ ముగిసిన సమయానికి జోరు వర్షం కురిసింది. ఆ తర్వాత చాలాసేపు వేచి చూసినప్పటికీ వర్షం తగ్గకపోవడం వల్ల చివరికి చేసేదేమి లేక పాక్ జట్టు బ్యాటింగ్‌కు దిగకుండానే మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు. దీంతో ఈ చిరకాల ప్రత్యర్థుల మధ్య హోరాహోరీ మ్యాచ్‌ను చూద్దామనుకున్న వరల్డ్ క్రికెట్ ఫ్యాన్స్‌కు తీవ్ర నిరాశే ఎదురైంది. కారణంగా అభిమానులందరూ డీలా పడిపోయారు.
Trump Dhoni : ధోనీకి ట్రంప్ స్పెషల్ ఇన్విటేషన్.. గోల్ఫ్ ఆడేందుకు పిలిచి..
Asia Cup Super 4 : ఆసియా కప్‌పై రోహిత్ సేన కన్ను.. ఆ జట్టును చిత్తు చేసేందుకు మాస్టర్ ప్లాన్!