ETV Bharat / sports

ఓపెనర్లు దూకుడు.. కోహ్లీ హాఫ్​ సెంచరీ.. పాక్​ లక్ష్యం ఎంతంటే? - asia cup TODAY MATCH

India vs Pakistan Asia cup Super Four
India vs Pakistan Asia cup Super Four
author img

By

Published : Sep 4, 2022, 9:21 PM IST

Updated : Sep 4, 2022, 9:38 PM IST

21:19 September 04

ఓపెనర్లు దూకుడు.. కోహ్లీ హాఫ్​ సెంచరీ.. పాక్​ లక్ష్యం ఎంతంటే?

India vs Pakistan Asia Cup : ఆసియా కప్​ సూపర్​-4లో భాగంగా పాకిస్థాన్​తో మ్యాచ్​లో భారత్​ మంచి స్కోరు సాధించింది. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 181 పరుగులు చేసింది. దాయాది ముందు 182 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. కోహ్లీ 44 బంతుల్లో 60 పరుగులతో భారత ఇన్నింగ్స్​లో టాప్​ స్కోరర్​గా నిలిచాడు. ఆఖర్లో వికెట్లు కోల్పోవడంతో తొలుత ఊహించినదానికంటే తక్కువకే పరిమితమైంది టీమ్​ ఇండియా.

తొలుత టాస్​ గెలిచిన పాక్​ కెప్టెన్​ బాబర్​ ఆజామ్​ ఫీల్డింగ్​ ఎంచుకున్నాడు. భారత ఓపెనర్లు రోహిత్​, రాహుల్​ దూకుడుగా ఆడారు. సిక్సర్లు, ఫోర్లతో పాక్​ బౌలర్లపై విరుచుకుపడ్డారు. కెప్టెన్ హిట్​ మ్యాన్​ ​16 బంతుల్లోనే 3 ఫోర్లు, 2 సిక్స్​లతో 28 పరుగులు చేసి హారిస్​ రౌఫ్​ బౌలింగ్​లో పెవిలియన్​ చేరాడు. అప్పటికి జట్టు స్కోరు 5.1 ఓవర్లకు 54. రాహుల్​ 16 బంతుల్లో 28 రన్స్​ చేశాడు. మిడిల్​ ఆర్డర్​ విఫలమైంది. సూర్యకుమార్​ యాదవ్​(13), పంత్​(14), హార్దిక్​ పాండ్య(0), దీపక్​ హుడా(16) ఆకట్టుకోలేకపోయారు. ఆఖర్లో రవి బిష్ణోయ్​ 2 బంతుల్లో 2 ఫోర్లు కొట్టాడు.

పాక్​ బౌలర్లలో షాదాబ్​ ఖాన్​ 2 వికెట్లు తీశాడు. నసీం షా, మహ్మద్​, హారిస్​ రౌఫ్​, మహ్మద్​ నవాజ్​ తలో వికెట్​ పడగొట్టారు.

Last Updated : Sep 4, 2022, 9:38 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.