ఇంగ్లాండ్తో నాలుగో టెస్టు రెండో ఇన్నింగ్స్లో 466 పరుగులకు ఆలౌట్ అయ్యింది టీమ్ఇండియా (ind vs eng test). రిషబ్ పంత్ (50), శార్దుల్ ఠాకూర్ (60) అర్ధ శతకాలతో ఆకట్టుకున్నారు. దీంతో ఇంగ్లాండ్కు 368 పరుగుల లక్ష్యాన్నిచ్చింది.
రోహిత్ శర్మ అద్వితీయ సెంచరీ (127) చేయగా, ఛతేశ్వర్ పుజారా (61) అర్ధ శతకం సాధించాడు. కెప్టెన్ విరాట్ కోహ్లీ (44), కేఎల్ రాహుల్ (46) కూడా రాణించారు.
ఇంగ్లాండ్ బౌలర్లలో క్రిస్ వోక్స్ 3 వికెట్లు పడగొట్టాడు. ఓలీ రాబిన్సన్, మొయిన్ అలీ తలో రెండు వికెట్లు తీశారు.
భారత్ తొలి ఇన్నింగ్స్: 191/10
ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్: 290/10
ఇదీ చూడండి: రోహిత్ రికార్డు.. ఇంగ్లాండ్ గడ్డపై భారత్ నుంచి ఒక్కడే