టీమ్‌ఇండియా, ఇంగ్లాండ్(fifth test india england) జట్ల మధ్య రద్దయిన ఐదో టెస్టు పంచాయితీ ఐసీసీకి చేరింది. టీమ్‌ఇండియా బృందంలో కరోనా ప్రభావం కారణంగా రద్దయిన ఈ టెస్టు భవితవ్యాన్ని తేల్చాల్సిందిగా ఈసీబీ అధికారికంగా ఐసీసీకి లేఖ రాసింది.
మ్యాచ్ భవితవ్యంపై బీసీసీఐ, ఈసీబీల మధ్య ఆమోదయోగ్య పరిష్కారం రాకపోవడం వల్ల ఇంగ్లాండ్ బోర్డు బంతిని ఐసీసీ కోర్టులోకి నెట్టింది. "అవును.. ఐసీసీకి లేఖ రాశాం" అని ఈసీబీ ప్రతినిధి తెలిపాడు. కరోనా కారణంగా మ్యాచ్ రద్దయినట్లు ప్రకటిస్తే 40 మిలియన్ పౌండ్లు (సుమారు రూ.40 కోట్లు) నష్టం వాటిల్లుతుందని ఈసీబీ ఆందోళన వ్యక్తంజేస్తోంది. ఈ సమస్యపై ఐసీసీ వివాద పరిష్కార కమిటీ సరైన నిర్ణయం తీసుకుంటే బీమా క్లెయిమ్ చేసుకునే వీలుంటుందని భావిస్తోంది. ఈ వ్యవహారంలో తమకు సాయం చేయాల్సిందిగా ఐసీసీని ఈసీబీ కోరుతోంది.
ఇదీ చూడండి: IND vs ENG: ఐదో టెస్టు రీషెడ్యూల్ కోసం రంగంలోకి గంగూలీ