India vs Bangladesh Match : మూడు వన్డేల సిరీస్ క్లీన్‌స్వీప్ కాకుండా భారత్ సూపర్ విక్టరీ సాధించింది. నామమాత్రమైన మూడో వన్డేలో బంగ్లాదేశ్‌పై టీమ్‌ఇండియా 227 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ భారత్ 409/8 భారీ స్కోరు చేయగా.. అనంతరం బంగ్లాదేశ్ 182 పరుగులకే ఆలౌటైంది. ఇప్పటి వరకు వన్డేల్లో అత్యధిక తేడాతో భారత్ గెలిచిన మూడో మ్యాచ్ కావడం విశేషం. బంగ్లా బ్యాటర్లలో షకిబ్ (43) టాప్ స్కోరర్. భారత బౌలర్లు శార్దూల్ 3, ఉమ్రాన్ 2, అక్షర్ పటేల్ 2.. సిరాజ్, కుల్‌దీప్ యాదవ్, వాషింగ్టన్ సుందర్ తలో వికెట్ తీశారు. మూడు వన్డేల సిరీస్‌ను బంగ్లాదేశ్ 2-1 తేడాతో కైవసం చేసుకుంది.
ఇషాన్ కిషన్ (210), విరాట్ కోహ్లీ (113) విజృంభించడంతో టీమ్‌ఇండియా 409/8 భారీ స్కోరు చేసింది. శిఖర్ ధావన్ (3), కేఎల్ రాహుల్ (8), శ్రేయస్ అయ్యర్ (3) విఫలం కాగా.. వచ్చిన అవకాశాన్ని ఇషాన్ సద్వినియోగం చేసుకొని రికార్డు సృష్టించాడు. దీంతో బంగ్లాదేశ్‌పై భారత్ పరువు పోకుండా కాపాడటంలో కీలక పాత్ర పోషించాడు.