ETV Bharat / sports

చెలరేగిన టీమ్​ఇండియా చిరుతలు- రెండో టీ20లో ఆసీస్​పై ఘన విజయం - ఆస్ట్రేలియా టూర్ ఆఫ్ ఇండియా టీ20 సిరీస్

India Vs Australia Second T20 2023 : ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టీ20లో టీమ్‌ఇండియా 44 పరుగుల తేడాతో విజయం సాధించింది. యశస్వి, రుతురాజ్​, ఇషాన్​ హాఫ్​ సెంచరీలతో అదరగొట్టారు. బౌలర్ రవి బిష్ణోయ్, ప్రసిద్ధ్ కృష్ణ చెరో​ మూడు వికెట్లు పడగొట్టారు.

India Vs Australia Second T20 2023
India Vs Australia Second T20 2023
author img

By ETV Bharat Telugu Team

Published : Nov 26, 2023, 10:47 PM IST

Updated : Nov 26, 2023, 10:54 PM IST

India Vs Australia Second T20 2023 : ఐదు మ్యాచ్​ల టీ20 సరీస్​లో భాగంగా ఆదివారం జరిగిన రెండో టీ20లో ఆస్ట్రేలియాపై 44 పరుగుల తేడాతో టీమ్ఇండియా ఘన విజయం సాధించింది. మొదట బ్యాటింగ్​కు దిగిన భారత్​ 4 వికెట్ల నష్టానికి 235 పరుగులు చేసింది. ఆసీస్​కు 236 భారీ టార్గెట్​​ను నిర్దేశించింది. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన కంగారూ జట్టు బ్యాటర్లు.. భారత బౌలర్ల ధాటికి మొదటి నుంచే తడబడ్డారు. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 191 పరుగులు చేసి కుప్పకూలింది ఆసీస్​. స్టాయినిస్ (45), టిమ్ డేవిడ్​ (37) రాణించారు. ఓపెనర్లు స్టీవెన్​ స్విత్​ (19), మాథ్యూ షార్ట్​ (19) ఆశించిన ప్రదర్శన చేయలేదు. సీన్​ అబాట్ (1), నాథన్ ఎలిస్ (1), ఆడమ్ జంపా (1) సింగిల్ డిజిట్​ స్కోరుకే వెనుదిరిగారు. ఆ తర్వాత వచ్చిన మాథ్యూ వేడ్​ (42*) దూకుడుగా ఆడాడు. చివరి వరకు పోరాడి స్కోర్​ బోర్డును పరుగులు పెట్టించాడు. తన్వీర్ సంఘా (2*) పరుగులు చేశాడు. మరోవైపు టీమ్ఇండియా బౌలర్లు ఆసీస్​పై విరుచుకు పడ్డారు. ప్రసిద్ధ్ కృష్ణ, రవి బిష్ణోయ్ చెరో మూడు వికెట్లు తీసి చెలరేగి పోయారు. ముకేశ్‌ కుమార్, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ ఒక్కో వికెట్​ పడగొట్టారు.

అంతకుముందు టాస్​ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన టీమ్ఇండియా భారీ స్కోరు చేసింది. బ్యాటర్లందరూ రాణించడం వల్ల నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 235 పరుగులు చేసింది. యశస్వి జైస్వాల్ (53; 25 బంతుల్లో 9x4, 2x6), రుతురాజ్‌ గైక్వాడ్ (58; 43 బంతుల్లో 3x4, 2x6), ఇషాన్ కిషన్‌ (52; 32 బంతుల్లో 3x4, 4x6) అర్ధ శతకాలతో అదరగొట్టారు. చివర్లో రింకు సింగ్ (31*; 9 బంతుల్లో 4x4, 2x6) మెరుపులు మెరిపించాడు. సూర్యకుమార్ యాదవ్ (19; 10 బంతుల్లో 2x6) కూడా దూకుడుగా ఆడాడు. ఆసీస్ బౌలర్లలో నాథన్‌ ఎలిస్ మూడు వికెట్లు, స్టాయినిస్ ఒక వికెట్ పడగొట్టారు.

స్టంపౌట్​ చేశాడని రిజ్వాన్​ను​ బ్యాట్​తో కొట్టబోయిన బాబర్!-​ వీడియో చూశారా?

గుజరాత్​ జట్టులోనే హార్దిక్- ఐపీఎల్‌ 2024కు ముందు ఫ్రాంచైజీలు రిలీజ్​ చేసిన ప్లేయర్లు వీరే!

Last Updated : Nov 26, 2023, 10:54 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.