India vs Australia 3rd ODI: వరల్డ్ కప్‌కు ముందు వార్మప్ మ్యాచ్‌లా జరుగుతున్న భారత్- ఆస్ట్రేలియా వన్డే సిరీస్.. తొలి రెండు రోజులు ఎంతో రసవత్తరంగా సాగింది. శుభ్‌మన్ గిల్, శ్రేయస్ అయ్యర్, అశ్విన్ లాంటి మేటి ప్లేయర్ల ధాటికి రెండో వన్డేలో 99 పరుగుల తేడాతో గెలుపొందిన భారత్.. ఈ మూడు వన్డేల సిరీస్‌ను 2-0తో కైవసం చేకుంది. ఇక గుజరాత్‌లోని సౌరాష్ట్ర స్టేడియం వేదికగా బుధవారం మూడో వన్డే జరగనుంది. అయితే ఈ మ్యాచ్ కోసం బరిలోకి దిగనున్న టీమ్ఇండియా జట్టులో కొన్ని కీలక మార్పులు జరిగేలా కనిపిస్తున్నాయి. ఈ క్రమంలో రానున్న మ్యాచ్‌కు టీమ్ఇండియా ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ దూరం కానున్నాడు. గాయం కారణంగా తొలి రెండు మ్యాచ్‌లకు హాజరుకాని అక్షర్.. బుధవారం జరగనున్న మూడో మ్యాచ్ కోసమైనా జట్టులోకి వస్తాడని అందరూ భావించారు. కానీ గాయం నుంచి ఇంకా కోలుకోకపోవడం వల్ల చివరి వన్డే మ్యాచ్‌కు అతను దూరం కానున్నాడు.
వరల్డ్ కప్‌క ముందు అక్షర్ ఇలా గాయపడటం టీమ్ఇండియాను ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా ఆస్ట్రేలియాతో సిరీస్‌కు దూరమైన క్రమంలో అతని ఫిట్‌నెస్‌పై అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అయితే వన్డే ప్రపంచకప్‌లో వార్మప్ మ్యాచ్‌ల వరకు వేచి ఉండాలని బీసీసీఐ సెలక్షన్ కమిటీ నిర్ణయం తీసుకుందట.ఇక భారత జట్టు సెప్టెంబర్ 30న ఇంగ్లాండ్‌తో, అక్టోబర్ 3న నెదర్లాండ్స్‌తో వార్మప్ మ్యాచ్‌లు ఆడనుంది. అంతలోపు అక్షర్ కోలుకోకపోతే ఇక జట్టు నుంచి తప్పుకోవడం ఖాయమని విశ్లేషకులు భావిస్తున్నారు.
అక్షర్ ప్లేస్‌లో ఆ స్టార్ స్పిన్నర్ ?
R Ashwin World Cup 2023 : వరల్డ్ కప్ జట్టులో ఒకవేళ అక్షర్ పటేల్‌ను తప్పించినట్లయితే అతని స్థానంలో రవిచంద్రన్ అశ్విన్ టీమ్‌లో చోటు దక్కించుకోవడం ఖాయం. ఆస్ట్రేలియాతో సిరీస్‌కు అశ్విన్ ఎంపికయ్యాడు. ఆ అవకాశాన్ని అందిపుచ్చుకున్న అశ్విన్,, 4 వికెట్లతో మెరిశాడు. ఈ క్రమంలో అక్షర్‌కు బదులుగా అశ్విన్‌ను ఎంపిక చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.
మరోవైపు రాజ్‌కోట్ వేదికగా జరగనున్న మూడో వన్డే నుంచి టీమిండియా ఓపెనర్ శుభ్‌మన్ గిల్, ఆల్‌రౌండర్ శార్దూల్ ఠాకూర్‌కు రెస్ట్ ఇచ్చారు. త్వరలో జరగనున్న వన్డే ప్రపంచకప్ కోసం సన్నాహాలు జరగుతున్నందున ఈ ఇద్దరు ఆటగాళ్లు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. ఇక అనుకున్నట్లుగానే ఈ ముూడో వన్డేకు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, హార్దిక్ పాండ్యా, జస్‌ప్రీత్ బుమ్రా జట్టులోకి రానున్నారు.
టీమ్ఇండియా తుది జట్టు (అంచనా) : రోహిత్ శర్మ (కెప్టెన్), హార్దిక్ పాండ్యా, (వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, రవిచంద్రన్ అశ్విన్, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, వాషింగ్టన్ సుందర్.
Ind vs Aus 2nd odi 2023 : టీమ్ఇండియా ఆల్‌రౌండ్ షో.. రెండో వన్డేలో ఆసీస్ చిత్తు.. సిరీస్ భారత్ వశం