ఐసీసీ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో భాగంగా ఏడేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత తొలిసారి టీమ్‌ఇండియా బంగ్లాదేశ్‌లో పర్యటించనుంది. డిసెంబర్‌లో బంగ్లా వేదికగా రెండు టెస్టు మ్యాచులు, మూడు వన్డే మ్యాచుల సిరీస్‌ను నిర్వహించనున్నట్టు ఆ దేశ క్రికెట్ బోర్డు గురువారం వెల్లడించింది.
"గతంలో భారత్- బంగ్లా మధ్య జరిగిన చారిత్రక మ్యాచ్ గొప్ప అనుభూతిని ఇచ్చింది. ఇరు దేశాల క్రికెట్ అభిమానులు మళ్లీ ఇటువంటి సందర్భం కోసం ఎదురుచూస్తున్నారు" అని బీసీబీ అధ్యక్షుడు నజ్ముల్ హస్సన్ తెలిపాడు. ఆసీస్ వేదికగా జరగనున్న టీ20 ప్రపంచకప్ అనంతరం టీమ్‌ఇండియా న్యూజిలాండ్‌లో పర్యటించనున్న విషయం తెలిసిందే. నవంబర్ 18 నుంచి 30 వరకు 3 టీ20లు, 3 వన్డేలను అక్కడ ఆడనుంది. అనంతరం బంగ్లాలోని షేర్- ఇ అంతర్జాతీయ స్టేడియం వేదికగా డిసెంబర్ 4,7,10 తేదీలలో వన్డేలు పూర్తిచేయనుంది. చిట్టగాంగ్‌లోని జహుర్ అహ్మద్ చౌదరి మైదానంలో డిసెంబర్ 14-18 మధ్య మొదటి టెస్టు, ధాకాలో 22-26 మధ్య రెండో టెస్టు మ్యాచును టీమ్‌ఇండియా ఆడనుంది.
ఇవీ చదవండి : వరల్డ్ కప్ టైటిల్ సాధించే దిశగా.. నడిపించు నాయకా!
'కుట్రపూరితంగానే గంగూలీని తప్పించారు'.. దాదాకు మద్దతుగా దీదీ