ETV Bharat / sports

అసలు 'బాక్సింగ్​ డే' టెస్టు అంటే ఏంటి? - what is the sprcaility of boxing day

ఆస్ట్రేలియాతో టీమ్​ఇండియా 'బాక్సింగ్ డే' టెస్టు ఆడనుంది. అసలు దానికి ఆ పేరు ఎలా వచ్చింది? ఎప్పటినుంచి పిలుస్తున్నారు? భారత్​ ఎన్నిసార్లు 'బాక్సింగ్ డే' మ్యాచ్​ ఆడింది?

why is boxing day test called boxing day test?
'బాక్సింగ్​ డే టెస్టు'కు ఆ పేరు ఎలా వచ్చిందంటే..?
author img

By

Published : Dec 25, 2020, 5:49 PM IST

Updated : Dec 25, 2020, 10:21 PM IST

మెల్​బోర్న్​లో శనివారం(డిసెంబర్​ 26) ప్రారంభమయ్యే భారత్​-ఆస్ట్రేలియా 'బాక్సింగ్​ డే' టెస్టు కోసం అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఈ మ్యాచ్​ను బాక్సింగ్ డే టెస్టు అని ఎందుకు పిలుస్తారు? దాని వెనుకున్న కథేంటి? తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.

అలా వచ్చిందా పేరు..

డిసెంబర్​ 26కు, బాక్సింగ్​ క్రీడకూ ఏ సంబంధమూ లేదు. బ్రిటన్, ఆస్ట్రేలియా, కెనడా, న్యూజిలాండ్ దేశాల్లో క్రిస్మస్​ తర్వాతి రోజున అందరూ తమ బంధవులను, స్నేహితులను కలిసి బహుమతుల బాక్సులను అందజేస్తారు. పండగ ముగిసిన తర్వాత రోజు అంటే డిసెంబరు 26న తమ వద్ద పనిచేసే వారందరికి యజమానులు సెలవు ఇచ్చి, వారికి కానుకలను అందజేస్తారు. అలా క్రిస్మస్​ ముగిసిన తర్వాతి రోజున అందరూ కుటుంబ సభ్యులతో సమయాన్ని గడుపుతూ.. వారికి వచ్చిన బహుమతి బాక్సులను పరిశీలిస్తారు. అలా ఆ రోజును 'బాక్సింగ్​ డే'గా పిలవడం ప్రారంభించారు.

why is boxing day test called boxing day test?
బాక్సింగ్​ డే టెస్టు

ఇదీ చరిత్ర..

ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్​ మధ్య మొదటిసారి 1950లో బాక్సింగ్​ డే టెస్టు జరిగింది. ఈ మ్యాచ్​లో 28 పరుగుల తేడాతో ఆసీస్​ విజయం సాధించింది. ఆ తర్వాత కూడా వివిధ దేశాలతో ఆస్ట్రేలియా, బాక్సింగ్ డే టెస్టుల్లో ఆడినప్పటికీ.. 1980 నుంచి ప్రతి ఏటా వరుసగా ఈ టెస్టుకు ఆస్ట్రేలియాలోని మెల్​బోర్న్​ క్రికెట్​ స్టేడియం ఆతిథ్యమిస్తోంది.

మెల్​బోర్న్​ క్రికెట్ గ్రౌండ్​

బాక్సింగ్​ డే టెస్టులో భారత్​..

మెల్​బోర్న్​ క్రికెట్​ మైదానంలో జరిగిన 'బాక్సింగ్​ డే' టెస్టుల్లో ఆస్ట్రేలియాతో భారత్​ 8 సార్లు తలపడింది. ఇందులో 5 మ్యాచ్​ల్లో కంగారు జట్టు గెలవగా.. 2018లో టీమ్​ఇండియా విజయం సాధించింది. మరో రెండు మ్యాచ్​లు డ్రాగా ముగిశాయి. 2011 నుంచి మెల్​బోర్న్​లో జరిగిన టెస్టుల్లో టీమ్​ఇండియా ఓడిపోలేదు. ​

వాటిని కూడా అదే పేరుతో..

'బాక్సింగ్​ డే' టెస్టు కేవలం ఆస్ట్రేలియాకు మాత్రమే పరిమితం కాలేదు. న్యూజిలాండ్​, దక్షిణాఫ్రికాల్లోనూ ఈ మ్యాచ్​లను అదే పేరుతో నిర్వహిస్తున్నారు. న్యూజిలాండ్​, పాకిస్థాన్​ మధ్య శనివారం నుంచి మొదలుకానున్న తొలి టెస్టు​నూ బాక్సింగ్​ డే టెస్టుగానే పిలుస్తున్నారు.

ఇదీ చూడండి:'బాక్సింగ్​ డే' టెస్టుకు భారత్ సై.. మరి గెలుపు?

Last Updated : Dec 25, 2020, 10:21 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.