ETV Bharat / sports

ఆసీస్​కు ఎదురుదెబ్బ.. రెండో వన్డేలో వార్నర్​కు గాయం

ఆస్ట్రేలియా ఆటగాడు వార్నర్​ తొడ కండరానికి గాయమైనట్లు తెలుస్తోంది. స్కానింగ్​ చేశాక అతడి పరిస్థితిని వెల్లడిస్తామని ఆసీస్​ జట్టు ఫిజియో చెప్పారు.

Warner
వార్నర్​కు గాయం
author img

By

Published : Nov 29, 2020, 4:05 PM IST

ఆస్ట్రేలియా జట్టుకు ఎదురుదెబ్బ తగిలింది. టీమ్​ఇండియాతో రెండో వన్డేలో ఆడుతున్న డేవిడ్​ వార్నర్​కు గాయమైంది. ​భారత బ్యాట్స్​మన్​ ధావన్​ కొట్టిన బంతిని అందుకునే ప్రయత్నంలో ఈ దెబ్బ తగిలినట్లు తెలుస్తోంది. దీంతో మ్యాచ్​ మధ్యలోనే మైదానాన్ని వీడాడు వార్నర్​. తొడ కండరానికి గాయమైనట్లు ఆసీస్​ జట్టు ఫిజియో చెప్పారు. స్కానింగ్​ చేశాక అతడి పరిస్థితిని చెబుతామని అన్నారు.

టాస్​ గెలిచి బ్యాటింగ్​ చేసిన ఆసీస్​.. నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 389 పరుగుల భారీ స్కోరు చేసింది. ‌స్మిత్‌ (104) మరోసారి సెంచరీతో చెలరేగగా.. డేవిడ్‌ వార్నర్‌ (83), ఆరోన్​ ఫించ్​ (60), లబుషేన్​ (70), మ్యాక్స్​వెల్(63*) అద్భుత ప్రదర్శన చేశారు. భారత బౌలర్లలో షమి, బుమ్రా, హార్దిక్ పాండ్య తలో వికెట్ తీశారు.

ఇదీ చూడండి : దంచికొట్టిన ఆస్ట్రేలియా.. టీమ్​ఇండియా లక్ష్యం 390

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.