ETV Bharat / sports

కెప్టెన్​గా కోహ్లీ ఇంకా మారాలి: వీవీఎస్ లక్ష్మణ్ - శాశ్వత స్థానం

సారథ్యం విషయంలో విరాట్​ కోహ్లీ ఇంకా కాస్త పురోగతి సాధించాలని మాజీ క్రికెటర్​ లక్ష్మణ్ అభిప్రాయపడ్డాడు​. జట్టులోని ఆటగాళ్లను తమ స్థానాల్లో స్థిరంగా ఉంచితేనే.. మెరుగ్గా రాణించగలుగుతారని అన్నాడు.

team india former cricketer vvs laxman about team india captain virat kohli
ఆ విషయంలో కోహ్లీ ఇంకా పురోగతి చెందాలి:వీవీఎస్​
author img

By

Published : Dec 16, 2020, 3:13 PM IST

టీమ్​ఇండియా కెప్టెన్ విరాట్​​ కోహ్లీ సమర్థమంతమైన నాయకుడు అయినప్పటికీ.. కెప్టెన్సీ విషయంలో ఇంకా మెరుగుపడాల్సిన అవసరముందని భారత మాజీ క్రికెటర్ వీవీఎస్​ లక్ష్మణ్​ అభిప్రాయపడ్డాడు. జట్టులో చిన్న చిన్న మార్పులు చేసి, ఆటగాళ్లను స్థిరంగా తయారు చేయాలని సూచించాడు. శాశ్వత స్థానం దొరికినప్పుడే.. జట్టు సభ్యులు మరింత బాగా ఆడతారని అన్నాడు.

"కోహ్లీ తన ఆటతీరుతో ఇతర జట్ల సభ్యులకు స్ఫూర్తిగా నిలుస్తున్నాడు. కానీ, నాయకత్వం విషయంలో ఇంకా పురోగతి సాధించాలి. అందులో ప్రధానమైనది జట్టు సభ్యులను స్థిరంగా కొనసాగించడం. లైనప్​​ను తరుచూ మార్చితే ఆటగాళ్లు అభద్రతా భావానికి గురవుతారు. ఓ అనుభవజ్ఞుడి ఆటగాడిగా అది నాకు తెలుసు. జట్టులో అనుభవం ఉన్న ఆటగాళ్లయినా, కొత్త వాళ్లయినా స్థిరత్వం కావాలని ఆశిస్తారు. అలా ఉండడం వల్ల మరింత మెరుగ్గా ఆడుతారు"

--- వీవీఎస్​ లక్ష్మణ్​, టీమ్​ఇండియా మాజీ క్రికెటర్​

ఆస్ట్రేలియాతో గురువారం జరగబోయే తొలి టెస్టులో(డే/నైట్​) సరైన జోడీతో బ్యాటింగ్​కు దిగడం భారత్​కు ప్రధానమని లక్ష్మణ్ చెప్పాడు​​. ప్రాక్టీస్​ మ్యాచ్​ల్లో కేఎల్​ రాహుల్​ ఆడకపోవడం తనను ఆశ్చర్యానికి గురిచేసిందని అన్నాడు.

ఇదీ చూడండి:పిచ్​ను కాదు.. బలాన్ని నమ్ముకోండి: కపిల్​ దేవ్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.