ETV Bharat / sports

రైజర్స్ వర్సెస్ రైడర్స్... గెలుపెవరిది ? - rashid

ఐపీఎల్ రెండో మ్యాచ్​లో కోల్ కతా నైట్​రైడర్స్​ హైదరాబాద్ సన్​రైజర్స్​​తో అమీతుమీ తేల్చుకోనుంది. రెండు జట్లు గెలుపు కోసం బరిలోకి దిగుతున్నాయి.

రైజర్స్ వర్సెస్ రైడర్స్
author img

By

Published : Mar 24, 2019, 7:30 AM IST

Updated : Mar 24, 2019, 9:32 AM IST

ఒకసారి కప్పు గెలిచి గత సీజన్​లో రన్నరప్​గా నిలిచిన జట్టు ఓ వైపు... రెండు సార్లు ఐపీఎల్ విజేతగా నిలిచిన జట్టు మరోవైపు. సన్​రైజర్స్ హైదరాబాద్, కోల్​కతా నైట్​ రైడర్స్ జట్ల మధ్య ఐపీఎల్ 2019 సీజన్ రెండో మ్యాచ్​ నేడు కోల్​కతా వేదికగా జరగనుంది. ఏడాది పాటు క్రికెట్​కు దూరంగా ఉన్న వార్నర్ పునరాగమనం చేయనున్నాడు. ఐపీఎల్​లో సత్తా చాటి ప్రపంచకప్​లో చోటు కోసం ప్రయత్నిస్తున్నాడు దినేశ్ కార్తీక్.

ఈ రెండు జట్లు ముఖాముఖి 15 సార్లు తలపడగా కోల్​కతానే ఎక్కువ మ్యాచ్​ల్లో విజయం సాధించింది. నైట్​రైడర్స్​ 9 సార్లు గెలవగా, సన్​రైజర్స్​ 6 సార్లు నెగ్గింది. గతేడాది కోల్​కతాని ఓడించి ఫైనల్​ చేరింది హైదరాబాద్. ఈ ఏడాది కూడా దినేశ్ కార్తీక్ సారథ్యంలోనే నైట్​రైడర్స్ బరిలోకి దిగనుంది. హైదరాబాద్ జట్టుకు విలియమ్సన్​ కెప్టెన్​గా వ్యవహరిస్తున్నాడు.

SRH AND KKR PREVIEW
విలియమ్సన్-దినేశ్ కార్తీక్

కోల్​కతా నైట్​రైడర్స్...

బలాలు: దినేశ్ కార్తీక్ గత సీజన్​లో 498 పరుగులు చేసి జట్టును మూడో స్థానంలో నిలిపాడు. ఓపెనర్లు క్రిస్​ లిన్, సునీల్ నరైన్​ జట్టుకు అదనపు బలం. ఇద్దరూ భారీ షాట్లు ఆడగల సమర్థులు. సునీల్ నరైన్, కుల్​దీప్ యాదవ్ లాంటి అంతర్జాతీయ స్పిన్నర్లు అందుబాటులో ఉన్నారు. మిడిల్ ఆర్డర్​లో రసెల్, బ్రాత్​వైట్ లాంటి విధ్వంసకర ఆటగాళ్లు జట్టులో ఉన్నారు.

బలహీనతలు: పేస్ విభాగం కాస్త బలహీనం. విండీస్ ఆల్​రౌండర్ బ్రాత్​వైట్, రసెల్ ఉన్నప్పటికీ గత సీజన్​లో అంతగా ప్రభావం చూపలేదు. ఈసారి వీరు ఎంత వరకు జట్టు గెలుపునకు కృషి చేస్తారన్నది తెలియాలి.

సన్​రైజర్స్ హైదరాబాద్..

బలాలు: డేవిడ్ వార్నర్ పునరాగమనం జట్టుకు కలిసొచ్చే అంశం. మార్టిన్ గప్తిల్, కేన్ విలియమ్సన్​లతో టాప్ ఆర్డర్ బలంగా ఉంది. భువనేశ్వర్, రషీద్ ఖాన్, సందీప్ శర్మ, కౌల్, ఖలీల్ అహ్మద్​లతో బౌలింగ్ విభాగం పటిష్టంగా ఉంది. గత రెండు సీజన్​లలో ఆరెంజ్ క్యాప్ సన్ రైజర్స్ ఆటగాళ్లకే దక్కడం (వార్నర్, విలియమ్స్​న్) విశేషం.

బలహీనతలు: మిడిల్ ఆర్డర్ బలహీనంగా ఉంది. యూసఫ్ పఠాన్, మనీశ్ పాండే, సాహాలు ఫామ్ అందిపుచ్చుకోవాల్సిన అవసరం ఉంది.
ఓపెనర్​ శిఖర్​ ధావన్​ దిల్లీ వెళ్లగా ఆ స్థానంలో విజయ్ శంకర్, షాబాజ్ నదీమ్, అభిషేక్ శర్మలను తీసుకుంది సన్​రైజర్స్. వీరు ఎలా ఆకట్టుకుంటారో చూడాలి.

జట్లు..

కోల్​కతా నైట్​ రైడర్స్: దినేశ్ కార్తీక్​(కెప్టెన్​), రాబిన్ ఊతప్ప, క్రిస్ ​లిన్, శుభ్​మన్​ గిల్​, ఆండ్రీ రసెల్​, కార్లోస్​ బ్రాత్​వైట్​, సునీల్ నరైన్​, పియూష్ చావ్లా, కుల్​దీప్​ యాదవ్​, నిఖిల్​ యాదవ్, జోయ్​ డెన్లై, శ్రీకాంత్​ ముండే, నితీశ్ రానా, సందీప్​ వారియర్​, ప్రసిధ్ కృష్ణ, లోకీ ఫెర్గ్యూసన్​, హ్యారి గుర్నే, కేసీ కరియప్ప, యర్రా పృథ్వీరాజ్​.

హైదరాబాద్ సన్​ రైజర్స్​: కేన్ విలియమ్సన్​(కెప్టెన్​), మనీశ్ పాండే, మార్టిన్ గప్తిల్​, రికీ భూయ్, డేవిడ్ వార్నర్​, దీపక్ హూడ, మహమ్మద్ నబీ, యూసఫ్ పఠాన్​, షకీబ్ అల్ హసన్​, అభిషేక్ శర్మ, విజయ్ శంకర్​, శ్రీ వాత్స గోస్వామి, బెయిర్​స్టో, వృద్ధిమాన్ సాహా, సిద్ధార్థ్ కౌల్, ఖలీల్ అహ్మద్, భువనేశ్వర్ కుమార్, రషీద్ ఖాన్, బసీల్ థంపీ, బిల్లి, టీ. నటరాజన్, సందీప్ శర్మ, షాబాజ్ నదీమ్.

Bengaluru (Karnataka), Mar 23 (ANI): Amid the political slugfest over a 'diary' alleging that top leaders of the Bharatiya Janata Party (BJP), including Prime Minister Narendra Modi, had received Rs 1,800 crore from former Karnataka Chief Minister BS Yeddyurappa, senior Congress leader DK Shivakumar on Friday asserted that some BJP leaders were coming out with their own versions. He further said that he would comment on the matter at an appropriate time. Speaking to ANI, Shivakumar said, "Some BJP leaders are coming out with their own information based on what information they had. Let me go through it. I don't want to comment on it. I will comment on it at an appropriate time. Congress party members have not spoken to me on this issue right now." Shivakumar's comments came after the BJP raked up the issue of raids by Income-Tax officials on the Karnataka Congress leader's properties in August 2017, in response to Congress' allegations.

Last Updated : Mar 24, 2019, 9:32 AM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.