ప్రపంచకప్‌లో వైఫల్యం తర్వాత మహేంద్ర సింగ్ ధోనీ ఇప్పటివరకు జట్టుకు దూరంగా ఉన్నాడు. ఫలితంగా రిటైర్మెంట్పై చాలా ఊహాగానాలే వస్తున్నాయి. ఈ విషయంపై ఇప్పటివరకు స్పందించలేదు. ధోనీ స్థానంలో వికెట్ కీపర్‌గా రిషభ్ పంత్ కొనసాగుతున్నాడు. వరుసగా సిరీస్‌ల్లో వైఫల్యాలు ఎదుర్కొన్న ఈ యువకీపర్కు అవకాశాలకు మాత్రం కొదవలేదు. ఇందుకు కారణం ధోనీనే అని పలువురి అభిప్రాయం. తాజాగా వీరిద్దరూ కలిసి క్రిస్మస్ వేడుకల్లోనూ పాల్గొన్నారు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో ప్రస్తుతం సందడి చేస్తోంది.
-
.@msdhoni and @RishabhPant17 celebrating Christmas in Dubai with friends!🎄🎁🥳 #MerryXmas #MSDhoni #Dhoni pic.twitter.com/33huzJVtkU
— MS Dhoni Fans Official (@msdfansofficial) December 25, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">.@msdhoni and @RishabhPant17 celebrating Christmas in Dubai with friends!🎄🎁🥳 #MerryXmas #MSDhoni #Dhoni pic.twitter.com/33huzJVtkU
— MS Dhoni Fans Official (@msdfansofficial) December 25, 2019.@msdhoni and @RishabhPant17 celebrating Christmas in Dubai with friends!🎄🎁🥳 #MerryXmas #MSDhoni #Dhoni pic.twitter.com/33huzJVtkU
— MS Dhoni Fans Official (@msdfansofficial) December 25, 2019
వచ్చే ఏడాది జరగనున్న ఐపీఎల్‌తో ధోనీ భవితవ్యం తేలనుందని క్రికెట్ పండితుల అభిప్రాయం. అందులో విజయవంతమైతే టీ20 ప్రపంచకప్‌లో మహీ ఆడే అవకాశముంది. కానీ పరిమిత ఓవర్ల క్రికెట్లో ధోనీ స్థానంలో పంత్‌ను కొనసాగించాలని చూస్తోంది టీమిండియా. మరి మెగాటోర్నీలో ధోనీ కీపింగ్ చేస్తాడా లేక పంత్ వస్తాడా? లేదా? వీరిద్దరూ ఆడతారా అన్నది ప్రశ్న.
ఇవీ చూడండి.. ఆటతో అలరించి.. ఆర్భాటం లేకుండా ముగించారు