ETV Bharat / sports

నాలుగో టెస్టుకు ఆసీస్​ యువ క్రికెటర్ దూరం - విల్ పకోస్కీ

నిర్ణయాత్మక గబ్బా టెస్టుకు ఆస్ట్రేలియా ఓపెనర్ విల్ పకోస్కీ దూరమయ్యాడు. మూడో టెస్టు ఆడుతూ తగిలిన గాయమే ఇందుకు కారణమని ఆ జట్టు కెప్టెన్ పైన్ చెప్పాడు.

Pucovski is ruled out of the Gabba Test
నాలుగో టెస్టుకు దూరమైన పకోస్కీ
author img

By

Published : Jan 14, 2021, 2:41 PM IST

టీమ్‌ఇండియాతో నాలుగో టెస్టుకు ఆస్ట్రేలియా యువ ఓపెనర్‌ విల్‌ పకోస్కీ దూరమయ్యాడు. అతడి స్థానంలో మార్కస్‌ హారిస్‌ తుది జట్టులో చేరాడు. ఈ విషయాన్ని ఐసీసీ ట్వీట్‌ చేసింది.

సిడ్నీలో మూడో టెస్టు ఐదో రోజు ఫీల్డింగ్ చేస్తూ పకోస్కీ గాయపడ్డాడు. బంతిని ఆపే క్రమంలో అతడు డైవ్‌చేస్తూ కింద పడ్డాడు. దీంతో కుడి భుజానికి గాయమైంది. దీంతో అతడు నాలుగో టెస్టు కోసం సాధన‌ చేయడం లేదని, శుక్రవారం నుంచి ప్రారంభమయ్యే చివరి టెస్టులో ఆడట్లేదని ఆస్ట్రేలియా కెప్టెన్‌ టిమ్‌పైన్‌ వెల్లడించాడు.

పకోస్కీ సిడ్నీ టెస్టుతోనే అంతర్జాతీయ కెరీర్‌ ఆరంభించాడు. అదే అతడికి తొలి టెస్టు. వార్నర్‌తో కలిసి ఓపెనింగ్‌ చేసి, తొలి ఇన్నింగ్స్‌లో అర్ధశతకం(62) చేయగా, రెండో ఇన్నింగ్స్‌లో 10 పరుగులకే ఔటయ్యాడు.

ఇప్పటివరకు భారత్‌-ఆస్ట్రేలియా చెరో టెస్టు గెలవగా సిడ్నీ మ్యాచ్‌ డ్రాగా ముగిసింది. దీంతో గబ్బా టెస్టుపైనే అందరి ఆసక్తి నెలకొంది. సిరీస్‌ ఫలితాన్ని ఈ మ్యాచ్‌ నిర్ణయించనుంది. మరి టీమ్‌ఇండియా ఈ మ్యాచ్‌ గెలిచి మరోసారి చరిత్ర సృష్టిస్తుందో లేదో చూడాలి.

ఇదీ చూడండి: ఎంపీ ట్వీట్​కు క్రికెటర్ విహారి కౌంటర్!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.