ETV Bharat / sports

నా చేతులు మళ్లీ దారిలోకి వచ్చాయి: స్టీవ్ స్మిత్ - బ్యాటింగ్​ గ్రిప్​పై స్మిత్ వ్యాఖ్యలు

సరైన బ్యాటింగ్​ గ్రిప్​ మళ్లీ దొరకడం వల్లే బాగా ఆడగలుగుతున్నానని చెప్పాడు ఆసీస్ స్టార్ స్మిత్. భారత్​తో జరిగిన వన్డే సిరీస్​లో రెండు సెంచరీలు బాదిన నేపథ్యంలోనే ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది.

Smith
'బ్యాటింగ్​ గ్రిప్ మార్చడం వల్లే అది సాధ్యమైంది'
author img

By

Published : Dec 2, 2020, 6:36 PM IST

టీమ్​ఇండియాతో వన్డే సిరీస్​లో తొలి రెండు మ్యాచ్​ల్లో సెంచరీలతో అదరగొట్టిన స్మిత్.. తన ప్రదర్శనకు గల కారణాలను వెల్లడించాడు. గ్రిప్ మార్చడం వల్లే ఇది సాధ్యమైందని చెప్పాడు.

ఈ ఏడాది ఐపీఎల్​​లో రాజస్థాన్​ రాయల్స్​కు కెప్టెన్సీ చేసిన స్మిత్​.. పేలవ బ్యాటింగ్​తో నిరాశపరిచాడు. 14 మ్యాచ్​లు ఆడి 311 పరుగులే చేశాడు. అయితే కొద్దిరోజుల విరామం తర్వాత భారత్​తో సిరీస్​లో చెలరేగుతున్నాడు. దీంతో 'నా చేతులు మళ్లీ దొరికేశాయి' అంటూ తన ఫామ్​ గురించి చెప్పుకొచ్చాడు.

"గతంలో నా గ్రిప్​ భిన్నంగా ఉండేది. 2014, 2015లో ఉత్తమ ప్రదర్శన చేసినప్పుడు నాకున్న గ్రిప్ వేరు. ఆ తర్వాత నా చేతులు అదుపు తప్పాయి. అందువల్లే బంతిని అనుకున్నట్లుగా టచ్​ చేయలేకపోయాను. మళ్లీ ఇప్పుడు నాకు సరైన గ్రిప్​ దొరికింది. ఈ బ్యాటింగ్​ శైలితో అనుకున్నట్లు ఆడుతున్నాను"

-స్టీవ్​ స్మిత్, ఆస్ట్రేలియా ఆటగాడు

ఇదీ చదవండి:మ్యాచులు ఆడకుండానే ఆటగాళ్లకు వేతనం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.