ఆస్ట్రేలియాతో జరుగుతోన్న నాలుగు టెస్టుల సిరీస్‌లో భారత్ గొప్ప పోరాట పటిమ చూపుతోందని ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్ ప్రశంసించాడు. బ్రిస్బేన్‌లోని గబ్బా స్టేడియంలో జరుగుతున్న నాలుగో టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో భారత లోయర్ ఆర్డర్ బ్యాట్స్‌మన్ రాణించడంపై వాన్ ఈ వ్యాఖ్యలు చేశాడు.
186 పరుగుల వద్ద ఆరో వికెట్ రూపంలో ప్రధాన బ్యాట్స్మన్లను టీమిండియా కోల్పోయింది. అరంగేట్ర ఆటగాడు వాషింగ్టన్ సుందర్, బౌలర్ శార్దుల్ ఠాకూర్లు వీరోచితంగా రాణించి జట్టును తిరిగి గాడిలో పడేశారని వాన్ తెలిపాడు.
"సిరీస్ ఆద్యంతం భారత్ గొప్ప ప్రదర్శన చేసింది. చాలా మంది ఆటగాళ్లు గాయపడినప్పటికీ.. రిజర్వ్ బెంచ్ బలంగా ఉంది." అని మైకేల్ వాన్ ట్వీట్ చేశాడు.
రసవత్తరంగా సిరీస్..
భారత్, ఆస్ట్రేలియా జట్లు బలమైన బ్యాటింగ్ లైనప్‌లు కలిగి ఉండడం వల్ల టెస్ట్ సిరీస్ రసవత్తరంగా సాగుతోందని.. ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ ఇయాన్ ఛాపెల్ అభిప్రాయపడ్డాడు.
ప్రస్తుతం 1-1తో సిరీస్ సమమైందని.. నాలుగో టెస్ట్ ఫలితం కోసం చూస్తున్నానని తెలిపాడు. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ కోసం ఇరుజట్లు ఫైనల్ చేరితే.. ఐసీసీ టైటిల్లోనూ పోరు బాగుంటుందని పేర్కొన్నాడు.
ఇదీ చదవండి: శార్దుల్, సుందర్ అర్ధసెంచరీలు- భారత్ 336 ఆలౌట్