ETV Bharat / sports

బాక్సింగ్​ డే టెస్టుకు వార్నర్​ దూరం

టీమ్​ఇండియాతో బాక్సింగ్​ డే టెస్టుకు ముందు ఆస్ట్రేలియాకు ఎదురుదెబ్బ తగిలింది. మెల్​బోర్న్​ వేదికగా జరగనున్న టెస్టుకు ఓపెనర్​ డేవిడ్​ వార్నర్​, పేసర్​ సీన్​ అబాట్​లు అందుబాటులో ఉండరని క్రికెట్​ ఆస్ట్రేలియా వెల్లడించింది.

Boxing Day Test: David Warner and Sean Abbott ruled out of 2nd Test vs India
ఆస్ట్రేలియాకు షాక్​.. బాక్సింగ్​ డే టెస్టుకు వార్నర్​ దూరం
author img

By

Published : Dec 23, 2020, 11:27 AM IST

మెల్​బోర్న్​ వేదికగా టీమ్​ఇండియాతో డిసెంబరు 26 నుంచి జరగనున్న బాక్సింగ్​ డే టెస్టుకు ఆసీస్​ ఆటగాళ్లు డేవిడ్​ వార్నర్​, పేసర్​ సీన్​ అబాట్​ దూరమయ్యారు. వార్నర్​ గాయం నుంచి పూర్తిగా కోలుకోలేదని క్రికెట్​ ఆస్టేలియా తెలిపింది. అబాట్​ గాయం నుంచి కోలుకున్నా.. రెండో టెస్టులో ఆడడని సీఏ స్పష్టం చేసింది. అయితే సిడ్నీలో జరిగే మూడో టెస్టులో వీరిద్దరూ ఆడే అవకాశం ఉందని బోర్డు వెల్లడించింది.

  • It has been confirmed that the groin injury will keep star opener, David Warner, out of the Boxing Day Test as well 🤕

    Will Australia stick with Matthew Wade and Joe Burns at the top of the order in Warner's absence? 🧐#AUSvIND pic.twitter.com/NT2Us0xbDe

    — ICC (@ICC) December 23, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

భారత్​తో రెండో వన్డే సందర్భంగా డేవిడ్​ వార్నర్ గాయపడ్డాడు. ఓ క్యాచ్​ను అందుకునే క్రమంలో అతడి తొడకండరం పట్టేసింది. దీంతో ఆ మ్యాచ్​ నుంచి భారత్​తో చివరి వన్డే సహా టీ20 సిరీస్​, అడిలైడ్​లో తొలి టెస్టుకు వార్నర్​ దూరమయ్యాడు.

ఇదీ చూడండి: ఇంగ్లాండ్​తో తొలి టెస్టుకూ షమీ అనుమానమే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.