ETV Bharat / sports

ఆస్ట్రేలియా పర్యటనకు భారత్.. కుటుంబాలకు నో ఎంట్రీ!

త్వరలో ఆస్ట్రేలియా పర్యటన కోసం భారత క్రికెటర్లతో పాటు వారి కుటుంబ సభ్యులను అనుమతించకపోవచ్చు. అయితే మొత్తం పర్యటన కోసం దాదాపు 32 మందిని ఎంపిక చేయాలని బీసీసీఐ భావిస్తోంది.

BCCI to pick 32-member team for Australia tour, unlike IPL 2020 no families allowed
ఆస్ట్రేలియా పర్యటనలో కుటుంబాలకు అనుమతి లేదు!
author img

By

Published : Oct 21, 2020, 12:00 PM IST

ఆస్ట్రేలియా పర్యటనకు టీమ్​ఇండియా ఆటగాళ్ల జాబితాను భారత క్రికెట్​ నియంత్రణ మండలి (బీసీసీఐ) సిద్ధం చేస్తోంది. నాలుగు టెస్టులతో పాటు పరిమిత ఓవర్ల సిరీస్​ కోసం దాదాపు 32 మందిని బీసీసీఐ ఎంపిక చేయనుందని సమాచారం. రెండు నెలలపాటు సాగే ఈ సిరీస్​ మధ్యలో వేరే ఆటగాళ్లను బయో-బబుల్​లోకి అనుమతించడానికి వీలులేని క్రమంలో సెలక్షన్​ కమిటీ ఎక్కువ మందికి ఆటగాళ్లను ఎంపిక చేయనుందని ఓ బీసీసీఐ అధికారి వెల్లడించారు.

"ఆస్ట్రేలియా పర్యటనకు ఎక్కువమంది ఆటగాళ్లను ఎంచుకోనున్నట్లు సెలక్షన్ కమిటీ తెలిపింది. సిరీస్​ మధ్యలో ఎవరైనా గాయపడితే భారత్​ నుంచి ఆటగాళ్లను రప్పించాల్సిన పరిస్థితి వస్తోంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని బ్యాకప్​ ఆటగాళ్ల కోసం ఎక్కువ మందిని ఆస్ట్రేలియాతో సిరీస్​కు ఎంచుకోనుంది"

- బీసీసీఐ అధికారి

టీమ్​ఇండియా జట్టులో ఎంపిక చేసిన 32 ఆటగాళ్లతో సహా సహాయకసిబ్బంది కలుపుకుని దాదాపుగా 50 మంది ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనున్నారు. ఇందులో భాగంగా నాలుగు టెస్టులు, మూడు వన్డేలు, మూడు టీ20లను టీమ్​ఇండియా ఆడనుంది. అడిలైడ్​ వేదికగా జరిగే తొలి మ్యాచ్​ డే-నైట్​ టెస్టు పద్ధతిలో జరగనుంది.

భారత క్రికెటర్లలో ఎక్కువ మంది ఐపీఎల్​లో పాల్గొనడానికి యూఏఈ వెళ్లగా.. టోర్నీలో ఆడని చెతేశ్వర్​ పుజారా, హనుమ విహారి లాంటి వారిని యూఏఈ రప్పించాలని బీసీసీఐ భావిస్తోంది. టోర్నీ పూర్తయిన తర్వాత ఐపీఎల్​ బయో-బబుల్​ నుంచి సరాసరి ఆస్ట్రేలియా వెళ్లడానికి సన్నాహాలు చేస్తున్నారు.

కుటుంబసభ్యులకు అనుమతి లేదు

ఇండియన్​ ప్రీమయర్​ లీగ్​ 2020 కోసం కుటుంబాలను అనుమతించే విషయంలో నిర్ణయాన్ని ఫ్రాంచైజీలకే బీసీసీఐ విడిచిపెట్టింది. టోర్నీ ప్రారంభానికి ముందు అనుష్క శర్మ, రితిక.. వారి భర్తలతో కలిసి వచ్చారు. కానీ, ధోనీ భార్య సాక్షి, అతని కుమార్తె జీవా మాత్రం యూఏఈ వెళ్లలేదు. ఐపీఎల్​ ముగిసిన తర్వాత ఆస్ట్రేలియా పర్యటనకు కుటుంబాన్ని అనుమతించక పోవచ్చనే ప్రచారం జరుగుతుంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.