ఆస్ట్రేలియాతో జరిగిన ఆఖరి టెస్ట్‌లో భారత్ ఘన విజయం సాధించింది. దీనితో నాలుగు టెస్టుల సిరీస్‌ను 2-1 తేడాతో కైవసం చేసుకుంది. 32 ఏళ్ల తర్వాత గబ్బాలో భారత్ తొలిసారి ఆస్ట్రేలియాకు ఓటమి రుచి చూపించడం విశేషం. ఈ చారిత్రక విజయాన్ని అందించిన టీమిండియాకు బీసీసీఐ రూ.5 కోట్ల నజరానా ప్రకటించింది.
ఈ విజయంపై దేశవ్యాప్తంగా ప్రముఖుల నుంచి టీమిండియా ఆటగాళ్లకు అభినందనలు వెల్లువెత్తున్నాయి.
'భారత క్రికెట్ చరిత్రలో ఈ విజయం ఎప్పటికీ గుర్తుండిపోతుంది. బీసీసీఐ రూ.5 కోట్ల బోనస్ ప్రకటించింది. ఈ సంఖ్యకన్నా విజయం ఎంతో విలువైనది.' అని బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ పేర్కొన్నారు.
ఇదీ చూడండి:ఆసీస్‌పై టీమ్ఇండియా చారిత్రక విజయం