ETV Bharat / sports

'పాండ్యలో ఇప్పుడే మరో ధోనీని చూశా' - ఆస్ట్రేలియా కోచ్ జస్టిన్ లాంగర్

భారత జట్టు సారథి విరాట్​ కోహ్లీని, ఆల్​రౌండర్​ హార్దిక్ పాండ్యను ప్రశంసించాడు ఆస్ట్రేలియా కోచ్ జస్టిన్ లాంగర్. కోహ్లీ లాంటి ఆటగాడిని ఇప్పటివరకు చూడలేదని, మ్యాచ్​ను ముగించడంలో హార్దిక్​.. ధోనీని తలపిస్తున్నాడని, రెండో టీ-20లో ఇది ప్రత్యక్షంగా చూశామని కొనియాడాడు.

langer
'పాండ్యలో మరో ధోనీని చూశాం'
author img

By

Published : Dec 7, 2020, 5:25 AM IST

ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టీ20లో కీలక ఇన్నింగ్స్ ఆడి భారత్ విజయంలో ముఖ్య పాత్ర పోషించిన ఆల్​రౌండర్ హార్దిక్ పాండ్యను ఆస్ట్రేలియా కోచ్ జస్టిన్​ లాంగర్ కొనియాడాడు. మ్యాచ్​ ముగించడంలో హార్దిక్​ పాండ్య.. ధోనీని తలపించాడని పేర్కొన్నాడు. ధోనీ ఆటతీరును గుర్తుచేశాడని తెలిపాడు.

''ఆటలో ఇదో అద్భుత ఘట్టం. పాండ్య ఎంత ప్రమాదకర ఆటగాడో మాకు తెలుసు. గతంలో మేం ధోనీని చూశాం. ఇప్పుడు పాండ్య రెండో టీ-20లో అదే తరహాలో ఆడాడు.''

- జస్టిన్​ లాంగర్​, ఆస్ట్రేలియా కోచ్​

langer
ధోనీతో హార్దిక్​ పాండ్య

కోహ్లీయే బెస్ట్..

టీమ్​ఇండియా సారథి విరాట్ కోహ్లీని కూడా ప్రశంసలతో ముంచెత్తాడు ఆస్ట్రేలియా కోచ్ లాంగర్. రెండో టీ20లో విరాట్ కొన్ని అద్భుతమైన షాట్లు ఆడాడని కొనియాడాడు.

" ఈ ఆట చాలా ఉత్కంఠభరితంగా సాగింది. విజయం ఆసీస్​దే అని భావించాను. కానీ, భారత ఆటగాళ్లు బాగా రాణించారు. కోహ్లీ అద్భుతమైన ఆటగాడు అని మొదటినుంచి చెబుతున్నాను. ఈ మ్యాచ్​లో చక్కటి షాట్స్ కొట్టాడు".

-జస్టిన్​ లాంగర్, ఆస్ట్రేలియా కోచ్.

ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టీ20 మ్యాచ్​లో భారత్​ గెలిచి.. సిరీస్​ కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్​లో హార్దిక్​ పాండ్య అద్భుతంగా ఆడి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.

ఇదీ చదవండి:'స్కూప్​ షాట్​పై డివిలియర్స్​ ఎలా స్పందిస్తాడో?'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.