ETV Bharat / sports

టీమ్​ఇండియా విచిత్రమైన రికార్డు.. టెస్టులో 20 వికెట్లు క్యాచ్​ అవుట్​లే - టీమ్​ఇండియా లేటెస్ట్​ న్యూస్

IND vs SA: ఒక్క టెస్టు మ్యాచ్​లో మొత్తం 20 వికెట్లు.. అన్నీ క్యాచ్​ అవుట్లే.. ఇది ఎక్కడైనా జరుగుతుందా..? అని సందేహిస్తున్నారా..? దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్​లో భారత్​కు ఇలాంటి చేదు అనుభవమే ఎదురైంది. మూడో టెస్టులో మొత్తం 20 వికెట్లు క్యాచ్​ల ద్వారా కోల్పోయి.. నయా రికార్డు నెలకొల్పింది టీమ్​ఇండియా.

IND vs SA
టీమ్​ఇండియా
author img

By

Published : Jan 15, 2022, 8:48 AM IST

IND vs SA: దక్షిణాఫ్రికా గడ్డపై టెస్టు సిరీస్ సాధించి చరిత్ర సృష్టించాలనుకున్న భారత్​కు నిరాశే మిగిలింది. ఆతథ్య సఫారీ జట్టు 7వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి 2-1 తేడాతో సిరీస్ సొంతం చేసుకుంది. అయితే ఈ టెస్ట్​ సిరీస్​తో విచిత్రమైన రికార్డునూ నమోదు చేసింది టీమ్​ ఇండియా.

మొత్తం 20 వికెట్లూ క్యాచ్​ అవుట్​ అయ్యాయి. ఇందులో ఒక్కటి కూడా బౌల్డ్ లేదా ఎల్​బీడబ్ల్యూ, రన్​అవుట్ లేవు. దీంతో మొత్తం 20 వికెట్లు క్యాచ్​ల ద్వారా కోల్పోయిన తొలి జట్టుగా చరిత్రకెక్కింది. ఈ 20 క్యాచ్​ల్లో ఏడు క్యాచ్​లను దక్షిణాఫ్రికా వికెట్ కీపర్ కెయిల్ వెర్రీన్ పట్టాడు.

ఇదే విషయంపై దక్షిణాఫ్రికా దిగ్గజ బౌలర్ షాన్ పొలాక్ స్పందిస్తూ.." ఇది నేను ఎప్పుడూ వినలేదు. ఇలాంటివి మనం రోజూ చూడలేము. ఒక జట్టు మొత్తం 20 వికెట్లు క్యాచ్​ల ద్వారానే ఔట్​ కావడం ఎన్నిసార్లు జరుగుతుంది.." అని తెలిపాడు.

గతంలో ఒక జట్టులో19 మంది బ్యాట్స్​మెన్​ క్యాచ్​ల ద్వారా అవుట్ అయిన సందర్భాలు ఉన్నాయి. 1982/83లో తొలిసారి ఇంగ్లాండ్​ వర్సెస్​ ఆస్ట్రేలియా టెస్టు సిరీస్​లో ఇలా జరిగింది. అప్పుడు ఇంగ్లాండ్ క్యాచ్​ల ద్వారా 19 వికెట్లు కోల్పోయింది. తర్వాత 2009/10లో పాకిస్థాన్​ వర్సెస్ ఆస్ట్రేలియా టెస్టు సిరీస్​లోనూ పాకిస్థాన్​కు ఇలాంటి అనుభవమే ఎదురైంది.

ఇదీ చూడండి: రహానేపై మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.