టీమ్ఇండియా, శ్రీలంక మధ్య జరగాల్సిన పరిమిత ఓవర్ల క్రికెట్ మ్యాచ్‌లు జులై 18 నుంచి ప్రారంభమవుతాయని బీసీసీఐ సెక్రటరీ జై షా ప్రకటించారు. ఆతిథ్య శ్రీలంక జట్టులో కరోనా కలకలంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.
షెడ్యూల్ ప్రకారం జులై 13 నుంచి మ్యాచ్‌లు ప్రారంభంకావాల్సి ఉంది. కానీ శ్రీలంక బ్యాటింగ్ కోచ్‌కు కరోనా సోకిన కారణంగా టీం సభ్యులకు క్యారెంటైన్ గడువును పొడిగించారు. జులై 18 నుంచి మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ మొదలవుతుందని స్పష్టం చేశారు. జులై18, 20, 23 తేదీల్లో వన్డే మ్యాచ్ జరగనుండగా.. టీ20 సిరీస్‌లు జులై 25 నుంచి ప్రారంభమవుతాయని పేర్కొన్నారు.
ప్రస్తుతం లంకలో ఉన్న టీమ్ఇండియా జట్టు.. ప్రాక్టీసులో బిజీగా ఉంది. ఈ పర్యటనలో భాగంగా ఇరుజట్ల మధ్య మూడు వన్డేలు, మూడు టీ20లు జరగనున్నాయి. మన టీమ్‌కు శిఖర్ ధావన్ కెప్టెన్సీ వహిస్తాడు.
ఇవీ చదవండి:Indw vs Engw t20: ఈ అద్భుత క్యాచ్ చూశారా?