కొలంబోలోని ప్రేమదాస స్టేడియం వేదికగా శ్రీలంకతో జరగనున్న మూడో వన్డేలో టాస్ గెలిచిన భారత్ కెప్టెన్ శిఖర్ ధావన్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఇప్పటికే మూడు వన్డేల సిరీస్‌ను 2-0తో గెలుచుకున్న ధావన్ సేన.. ఈ మ్యాచ్‌ను కూడా గెలిచి సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేయాలని భావిస్తోంది.
ఇక నామమాత్రమైన మూడో వన్డేలో కొత్త వారికి అవకాశమిచ్చింది టీమ్ఇండియా. ఇక సిరీస్‌ను కోల్పోయిన శ్రీలంక కనీసం ఈ మ్యాచ్‌లోనైనా గెలిచి పరువు నిలుపుకోవాలని ప్రయత్నిస్తోంది.
తుది జట్లు:
టీమ్ఇండియా: పృథ్వీషా, శిఖర్ ధావన్(కెప్టెన్), సంజూ శాంసన్ (వికెట్ కీపర్), మనీశ్ పాండే, సూర్య కుమార్ యాదవ్, నితీశ్ రానా, హార్దిక్ పాండ్యా, కృష్ణప్ప గౌతమ్, రాహుల్ చాహర్, నవ్‌దీప్ సైనీ, చేతన్ సకారియా.
శ్రీలంక: అవిష్క ఫెర్నాండో, మినోద్ భానుక(వికెట్ కీపర్), భానుక రాజపక్సా, ధనుంజయ్ డీ సెల్వా, చరిత్ అసలంక, దుసన్ శనక(కెప్టెన్), రమేశ్ మెండీస్, చమికా కరుణరత్నే, అకిల ధనుంజయ, దుష్మంత చమీర, ప్రవీణ్ జయవిక్రమ.
ఇదీ చూడండి.. 'ఇందిరా నగర్‌కే కాదు.. ఇండియా మొత్తానికే గూండా'