ETV Bharat / sports

వీక్షణలో ప్రపంచ టెస్టు ఛాంపియన్​షిప్​ ఫైనల్​ ఘనత - డబ్ల్యూటీసీ ఫైనల్

ప్రపంచ టెస్టు ఛాంపియన్​షిప్​ ఫైనల్​(WTC Final)​ వీక్షణలలో సరికొత్త రికార్డులు సృష్టించింది. రెండేళ్ల డబ్ల్యూటీసీ చట్రంలో ఏ మ్యాచ్​కు రానన్ని వ్యూస్​ ఇండియా-కివీస్​ మ్యాచ్​కు వచ్చాయని ఐసీసీ వెల్లడించింది. ఇంతకీ ఎన్ని కోట్ల వ్యూస్ వచ్చాయంటే?

wtc final, india vs new zealand
డబ్ల్యూటీసీ ఫైనల్, ఇండియా vs కివీస్​
author img

By

Published : Jul 28, 2021, 1:20 PM IST

ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్​షిప్​ అరుదైన ఘనత నమోదు చేసింది. ఫైనల్​​(WTC Final) సరికొత్త రికార్డు సృష్టించింది. గత నెలలో భారత్-కివీస్​ మధ్య జరిగిన ఈ మ్యాచ్​ను ప్రపంచవ్యాప్తంగా 17.7 కోట్ల మంది వీక్షించారని అంతర్జాతీయ క్రికెట్​ మండలి బుధవారం వెల్లడించింది. రెండేళ్ల పాటు జరిగిన డబ్ల్యూటీసీలో(WTC) ఏ మ్యాచ్​కు రానన్ని వ్యూస్ ఫైనల్​కు వచ్చాయని చెప్పింది.

ప్రపంచ దేశాలలో భారత్ నుంచే ఎక్కువ మంది అభిమానులు ఈ మ్యాచ్​ను చూశారని ఐసీసీ(ICC) తెలిపింది. వీరిలోనూ 94.6 శాతం మంది స్టార్​ స్పోర్ట్స్​, దూరదర్శన్​ ఛానళ్ల ద్వారా ఫైనల్​ను వీక్షించారని వెల్లడించింది. తెలుగు, హిందీ, తమిళం, కన్నడ వంటి ప్రాంతీయ భాషల్లోనూ స్టార్​ స్పోర్ట్స్​ ఛానెల్ మ్యాచ్​ను ప్రత్యక్ష ప్రసారం చేసింది.

ఈ టెస్టు జూన్​ 18-జులై 23 వరకు జరిగింది. వరుణుడు అడ్డంకిగా మారిన ఈ మ్యాచ్​కు 23వ తేదీని రిజర్వ్​ డేగా ప్రకటించారు. ఈ మ్యాచ్​లో కివీస్​ 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది.

జనాభా పరంగా చిన్న దేశమైన న్యూజిలాండ్​లోనూ డబ్ల్యూటీసీ ఫైనల్​ మ్యాచ్​కు మంచి స్పందన లభించింది. 2 లక్షల మంది అభిమానులు ఈ మ్యాచ్​ను చూశారని ఐసీసీ తెలిపింది. ఆ దేశంలో స్కై స్పోర్ట్స్​ ఛానల్​ ఈ ఫైనల్​ను ప్రత్యక్ష ప్రసారం చేసింది. యూకేలోనూ స్కై స్పోర్ట్స్​కు రికార్డు స్థాయిలో వీక్షణలు వచ్చాయి. 2015 తర్వాత ఇంగ్లాండ్​ జట్టు ఆడని ఓ మ్యాచ్​ను అక్కడి అభిమానులు పెద్ద మొత్తంలో చూడడం ఇదే మొదటిసారి అని ఐసీసీ వెల్లడించింది.

ఐసీసీ కొత్తగా ప్రారంభించిన ఓటీటీ ప్లాట్​ఫామ్​ ఐసీసీ.టీవీ ద్వారా మరో 6.65 లక్షల ప్రత్యక్ష వీక్షణలు వచ్చాయి.ఐసీసీ ఫేస్​బుక్​ పేజీ ద్వారా 42.3 కోట్ల మంది మ్యాచ్​ను చూశారు. ఇందులో రిజర్వ్​ డే రోజున అత్యధిక వ్యూస్​ వచ్చాయి. ఆ ఒక్క రోజే 6.57 కోట్ల మంది ఈ మ్యాచ్​ను వీక్షించారు. ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్​ సందర్భంగా ఉన్న 6.43 కోట్ల వీక్షణల సంఖ్యను ఇది చెరిపేసింది.

మరో డిజిటల్ ప్లాట్​ఫామ్​ ఇన్​స్టా వేదికగా ఈ మ్యాచ్​ను 7 కోట్ల మంది చూశారు. ఐసీసీ వెబ్​సైట్​, మొబైల్​ యాప్​, ట్విట్టర్, యూ ట్యూబ్​​లో ఐసీసీ ఛానల్ ద్వారా లెక్కేసుకుంటే మొత్తం వీడియో వ్యూస్​ 51.5 కోట్లు దాటినట్లు ఐసీసీ వెల్లడించింది.

ఇదీ చదవండి: టీమ్​ఇండియాకు షాకిచ్చిన ఇంగ్లాండ్ మాజీ​ క్రికెటర్​ మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.