IND VS NZ T20 Match Abandoned: న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లిన భారత్‌కు కలిసిరాలేదు. తమ సత్తాను చాటేందుకు ఇదొక మంచి అవకాశంగా భావించిన టీమ్‌ఇండియా యువ క్రికెటర్లకు నిరాశే ఎదురైంది. మూడు టీ20ల సిరీస్‌లో వెల్లింగ్టన్ వేదికగా జరగాల్సిన తొలి మ్యాచ్ వర్షం కారణంగా రద్దైంది. కనీసం ఐదు ఓవర్ల మ్యాచ్ అయినా నిర్వహించేందుకు వీలుపడుతుందేమోనని భావించినా.. వర్షం ఆగకపోవడంతో టాస్ వేయకుండానే మ్యాచ్‌ను రద్దు చేస్తూ అంపైర్లు నిర్ణయం తీసుకొన్నారు. ఇక రెండో టీ20 మ్యాచ్ మౌంట్ మౌంగనుయ్ వేదికగా నవంబర్ 20న జరగనుంది.
ప్రపంచకప్‌లో ఎదురైన ఓటమి నుంచి తేరుకునే ప్రయత్నం చేస్తున్న భారత జట్టుకు ఈ సిరీస్ ఎంతో కీలకం కానుంది. రోహిత్ శర్మకు విశ్రాంతినివ్వడంతో జట్టు నాయకత్వ బాధ్యతలు హార్దిక్ పాండ్యా చేపట్టాడు. ఉమ్రాన్ మాలిక్, సంజూ శాంసన్, ఇషాన్ కిషన్, కుల్‌దీప్ యాదవ్ వంటి ఆటగాళ్లకు జట్టులో స్థానం దక్కింది.