ETV Bharat / sports

Rohit test century: రోహిత్​ సెంచరీ చేస్తే- భారత్​ గెలవాల్సిందే! - రోహిత్ శర్మ సెంచరీ

టీమ్​ఇండియా ఓపెనర్ రోహిత్ శర్మ టెస్టు సెంచరీలకు (rohit test century) ఓ ప్రత్యేకత ఉంది. అతడు శతకం చేసిన ఏ మ్యాచ్​లోనూ భారత్​ పరాజయం కాలేదు.

rohit test century
రోహిత్ శర్మ సెంచరీ
author img

By

Published : Sep 7, 2021, 7:56 PM IST

టెస్టుల్లో భీకర ఫామ్​తో దూసుకుపోతున్నాడు హిట్​మ్యాన్ రోహిత్​శర్మ. ఓవల్​ టెస్టులో ఇంగ్లాండ్​పై అద్భుత శతకంతో టీమ్​ఇండియా చారిత్రక విజయంలో కీలక పాత్ర పోషించాడు. అయితే ఇదొక్కటే కాదు. టెస్టుల్లో అతడు సెంచరీ (rohit test century) చేసిన ఏ ఒక్క మ్యాచ్​లోనూ భారత్​ ఓడిపోలేదు. ఇప్పటివరకు అతడు 8 శతకాలు బాదగా, అన్నింటా టీమ్​ఇండియాదే విజయం.

రోహిత్​ శర్మ సెంచరీలు

వెస్టిండీస్​పై 177 - భారత్​ గెలుపు

వెస్టిండీస్​పై 111* - భారత్​ విజయం

శ్రీలంకపై 102* - భారత్​ గెలుపు

దక్షిణాఫ్రికాపై 176 - భారత్​ ఘన విజయం

దక్షిణాఫ్రికాపై 127 - భారత్​ విజయ ఢంకా

దక్షిణాఫ్రికాపై 212 - భారత్​ విజయం

ఇంగ్లాండ్​పై 161 - భారత్​ జయభేరి

ఇంగ్లాండ్​పై 127 - భారత్​ గెలుపు

నాలుగో టెస్టులో శతకంతో సత్తా..

ఇంగ్లాండ్‌తో జరిగిన నాలుగో టెస్టులో భారత జట్టు.. 157 పరుగుల తేడాతో విజయం సాధించింది. విజయానికి ఆఖరిరోజు 291 పరుగులు చేయాల్సిన ఆతిథ్య జట్టు.. భారత బౌలర్ల ధాటికి 210 పరుగులకు ఆలౌటైంది.

తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 191 పరుగులకు ఆలౌట్‌కాగా.. ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 290 పరుగులు చేసింది. రోహిత్ శర్మ శతకంతో సత్తా చాటడం వల్ల రెండో ఇన్నింగ్స్‌లో 466 పరుగులు చేసిన భారత జట్టు ప్రత్యర్థికి 368 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది.

ఇదీ చూడండి: WTC points Table: ఇంగ్లాండ్​పై విజయం.. అగ్రస్థానంలో భారత్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.