ETV Bharat / sports

కివీస్​తో సిరీస్‌ సమం చేయాలంటే.. వరుణుడు ఆగాల్సిందే! - భారత్​ న్యూజిలాండ్​ సిరీస్​ 2022

భారత్​-న్యూజిలాండ్​ జట్ల మధ్య మూడు వన్డేల సిరీస్​లో బుధవారమే చివరి మ్యాచ్​. ఇందులో టీమ్​ఇండియా గెలిస్తే సిరీస్​ సమమవుతుంది. ఒకవేళ కివీస్​ విజయం సాధించినా, మ్యాచ్​ రద్దైన న్యూజిలాండ్​ సిరీస్​ను సొంతం చేసుకుంటుంది.

india new zealand match
india new zealand match
author img

By

Published : Nov 29, 2022, 10:41 PM IST

NZ vs IND: వర్షం పడకుండా ఉండాలని టీమ్‌ఇండియా బలంగా కోరుకుంటోంది. ఎందుకంటే మూడు వన్డేల సిరీస్‌లో ఇప్పుడు కివీస్‌ 1-0 ఆధిక్యంలో ఉంది. రెండో వన్డే వర్షార్పణం అయిన సంగతి తెలిసిందే. ఇక కీలకమైన చివరి వన్డే బుధవారం జరగనుంది. ఇందులో గెలిచినా.. వర్షం వచ్చి రద్దు అయినా సిరీస్‌ న్యూజిలాండ్‌ సొంతమవుతుంది. అందుకే చివరి మ్యాచ్‌ జరగాలని.. అందులో భారత్‌ విజయం సాధించాలని అభిమానులు కోరుకుంటున్నారు. అయితే క్రైస్ట్‌చర్చ్‌లో వర్షం పడే సూచనలు ఉన్నట్లు వాతావరణ శాఖ చెబుతోంది. ఆటకు అంతరాయం కలిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

ఉమ్రాన్‌ మాలిక్‌

బ్యాటింగ్‌ ఫర్వాలేదు.. బౌలింగ్‌ ఇంకాస్త..
తొలి వన్డేలో భారత్‌ బ్యాటింగ్‌ అనుకొన్నట్లుగానే సాగింది. పిచ్‌ బౌలింగ్‌కు సహకరిస్తున్న వేళ ఓపెనర్లు ఎంతో నిలకడగా ఆడి పరుగులు రాబట్టారు. కివీస్‌ ఎదుట 307 పరుగులను లక్ష్యంగా ఉంచింది. అయితే భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్‌ మిడిలార్డర్‌ను అడ్డుకోవడంలో భారత బౌలర్లు విఫలం కావడం కలవరపెట్టింది. ఉమ్రాన్‌ మాలిక్‌, వాషింగ్టన్ సుందర్ మినహా ఎవరూ ప్రభావం చూపలేకపోయారు. ఆరంభ ఓవర్లలో అద్భుతంగా వేసిన శార్దూల్ ఠాకూర్ కీలకమైన సమయంలో భారీగా పరుగులు సమర్పించాడు. కేన్ విలియమ్సన్ (94*), టామ్‌ లాథమ్ (145*) నాలుగో వికెట్‌కు రికార్డు స్థాయిలో 221 పరుగులను జోడించారు. వీరిని ఔట్ చేయలేక ఇబ్బంది పడ్డారు. చివరి వన్డేలోనూ ఇలాంటి ప్రదర్శనే పునరావృతమైతే సిరీస్‌ పోవడం ఖాయం. అలాగే వన్డే ప్రపంచకప్‌ సూపర్ లీగ్‌ పాయింట్ల టేబుల్‌లో ర్యాంక్‌ కూడా పడిపోతుంది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.