womens asia cup 2022 : ఆసియా కప్‌లో భారత మహిళా క్రికెట్ జట్టు అదరగొట్టేస్తోంది. వరుసగా మూడో విజయం సాధించి గ్రూప్‌లో అగ్రస్థానానికి దూసుకెళ్లింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) మీద 104 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. టాస్ నెగ్గిన భారత్ బ్యాటింగ్ ఎంచుకొంది. దీంతో తొలుత బ్యాటింగ్ చేసిన టీమ్‌ఇండియా నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 178 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనలో యూఏఈ 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 74 పరుగులే చేసి ఓటమిపాలైంది.
టీమ్‌ఇండియా బౌలర్ల దెబ్బకు ఐదు పరుగులకే మూడు వికెట్లు కోల్పోయిన యూఏఈ కోలుకోలేకపోయింది. కవిష ఎగోడగే 54 బంతుల్లో 30 పరుగులు చేసింది, కుషి శర్మ 50 బంతుల్లో 29 రన్స్ సాధించింది. కుషి.. మరీ నెమ్మదిగా ఆడటంతో పరుగుల రాక ఇబ్బంది మారింది. యూఏఈ ఇన్నింగ్స్‌లో ఒక్క సిక్సూ లేకపోవడం గమనార్హం. భారత బౌలర్లలో రాజేశ్వరి గైక్వాడ్ 2, దయాలన్ హేమలత ఒక వికెట్ తీశారు. హ్యాట్రిక్ విజయాలు సాధించడంతో సెమీస్‌కు చేరుకొనే అవకాశాలను టీమ్‌ఇండియా మరింత మెరుగుపర్చుకుంది. అంతకుముందు శ్రీలంక, మలేషియా జట్లను భారత్ చిత్తు చేసింది.
దుమ్మురేపిన రోడ్రిగ్స్, దీప్తి శర్మ
అయితే దీప్తి శర్మ 49 బంతుల్లో 64 పరుగులతో కలిసి జెమీమా రోడ్రిగ్స్ 45 బంతుల్లో 75 పరుగులు చేసి భారత ఇన్నింగ్స్‌ను నిలబెట్టింది. వీరిద్దరూ నాలుగో వికెట్‌కు 13.3 ఓవర్లలో 129 పరుగులు జోడించారు. చివర్లో పూజా వస్త్రాకర్ 13, కిరన్ నవ్‌గిరె 10 పరుగులు చేసి బ్యాట్‌ను ఝలిపించడం వల్ల భారత్ 178 పరుగులు చేయగలిగింది. యూఏఈ బౌలర్లలో ఛాయా ముఘల్, మహికా గౌర్, ఈషా, సురక్ష తలో వికెట్ తీశారు. అక్టోబర్ ఏడో తేదీన (శుక్రవారం) భారత్ తదుపరి మ్యాచ్‌లో పాకిస్థాన్‌తో తలపడనుంది.
ఇవీ చదవండి: పంత్‌కు ఊర్వశి 'స్పెషల్' బర్త్‌డే విషెస్.. రెడ్ హాట్ లుక్‌లో ఫ్లయింగ్ కిస్..
'ఇప్పుడే ఫామ్‌లోకి వచ్చారు.. అప్పుడే రెస్ట్ ఇస్తే ఎలా?'.. మేనేజ్మెంట్పై మాజీలు ఫైర్!