ETV Bharat / sports

'పాక్​లో 5 రోజుల టెస్ట్ మ్యాచ్​​ ఫ్యాన్స్​కు​ బోర్​ కొట్టిందట.. అందుకే 3 రోజుల్లోనే పూర్తి చేశాం' - భారత్​ ఆస్ట్రేలియా వార్తలు

బోర్డర్​ గావస్కర్​ ట్రోఫీలో తొలి మూడు టెస్ట్​లు రెండున్నర రోజుల్లోనే ముగియడంపై పలువురు మాజీలు భిన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. దీనిపై టీమ్​ఇండియా కెప్టెన్​ రోహిత్​ శర్మ కూడా స్పందించాడు. ఏమన్నాడంటే?

rohith sharma
rohith sharma
author img

By

Published : Mar 3, 2023, 3:11 PM IST

ప్రతిష్ఠాత్మక బోర్డర్​ గావస్కర్​ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన మూడో టెస్ట్​లో టీమ్​ఇండియా ఓటమి చవిచూసింది. తొలి రెండు టెస్టుల్లో గెలిచి మంచి ఊపుమీద ఉన్న భారత క్రికెట్​ జట్టుకు ఆసీస్​ బ్రేక్​ ఇచ్చింది. ఇందౌర్​లో జరిగిన మ్యాచ్​లో తొమ్మిది వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. అంతే కాకుండా ప్రపంచ టెస్ట్​ ఛాంపియన్ షిప్​ ఫైనల్​కు దూసుకెళ్లింది.

అయితే తొలి రెండు టెస్టులు లానే మూడో టెస్ట్​ మ్యాచ్​ కూడా రెండున్నర రోజుల్లోనే ముగిసింది. అంతే కాకుండా కేవలం ఏడు సెషన్లలోనే మ్యాచ్​ పూర్తయింది. కాగా, బోర్డర్​ గావస్కర్​ ట్రోఫీలో తొలి మూడు మ్యాచులు రెండున్నర రోజుల్లోనే ముగియడం పట్ల పలువురు మాజీలు భిన్న అభిప్రాయాలు వ్యక్తం చేశారు. ఇదే ప్రశ్న.. మ్యాచ్​ అనంతరం విలేకరుల సమవేశంలో కెప్టెన్​ రోహిత్​ శర్మకు కూడా ఎదురైంది. హిట్​మ్యాన్​ కూడా తనదైన శైలిలో సమాధానమిచ్చాడు.

పాకిస్థాన్​లో ఐదు రోజుల టెస్టు మ్యాచ్‌లు అభిమానులకు విసుగు తెప్పిస్తున్నాయని, అందుకే భారత జట్టు బోర్డర్ గవాస్కర్‌ ట్రోఫీలో ఆటను మూడు రోజుల్లో ముగించిందని రోహిత్‌ చురకలు అంటించాడు. "టెస్టు మ్యాచ్‌ ఐదు రోజుల పాటు సాగాలంటే ఇరు జట్ల ప్లేయర్లు ఆడాలి. భారత్‌లో మాత్రమే కాకుండా విదేశాల్లో కూడా కొన్ని టెస్టులు ఐదు రోజుల పాటు జరగవు. గురువారం దక్షిణాఫ్రికాలో జరిగిన టెస్టు కూడా మూడో రోజుల్లోనే ముగిసింది. అయితే పాకిస్థాన్‌లో మాత్రం ఐదు రోజుల పాటు జరిగే టెస్టు మ్యాచ్‌ బోర్‌ కొడుతుందని అభిమానులు అంటున్నారు. అందుకే మేము మ్యాచ్‌లను మూడు రోజుల్లో పూర్తి చేస్తున్నాం" అని రోహిత్‌ సీరియస్‌ అయ్యాడు.

'డబ్ల్యూటీసీ ఫైనల్‌ గురించి ఆలోచించడం లేదు'
"ఒక టెస్టు మ్యాచ్‌లో ఓడిపోతే.. చాలా విషయాలు మన చేతుల్లో లేవని అర్థం. తొలుత బ్యాటింగ్‌లో సరైన ఆరంభం దక్కలేదు. ప్రత్యర్థి 80 - 90 పరుగుల ఆధిక్యం సాధించాక.. తొలి ఇన్నింగ్స్‌లో మా స్కోరు బోర్డుపై మరిన్ని పరుగులు ఉంటే బాగుండేదనిపించింది. ఇక రెండో ఇన్నింగ్స్‌లోనూ అనుకున్న విధంగా బ్యాటింగ్‌ సాగలేదు. ఆసీస్‌కు కేవలం 76 పరుగులనే లక్ష్యంగా నిర్దేశించాం. తొలి రెండు మ్యాచుల్లో ఎలా రాణించాం.. ఇప్పుడీ మ్యాచ్‌లో ఎందుకు ఓడిపోయామనేదానిపై అందరం కలిసి చర్చించుకుంటాం."

"ఇప్పటి వరకు డబ్ల్యూటీసీ ఫైనల్‌ గురించి ఆలోంచించలేదు. తర్వాత అహ్మదాబాద్‌ వేదికగా జరిగే మ్యాచ్‌లో విజయం సాధించేందుకు ప్రయత్నిస్తాం. పిచ్‌లతో సంబంధం లేకుండా మన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించాల్సిన అవసరం ఉంది. సవాళ్లతో కూడుకున్న పిచ్‌లపై ధైర్యంగా ఆడాలి. బౌలింగ్‌లో రాణించినప్పటికీ.. బ్యాటింగ్‌లో ఆ తెగువ చూపించలేకపోయాం. ప్రణాళికలను అమలు చేయడంలో జరిగిన తప్పిదాల వల్లే ఇలా ఓటమిబాట పట్టాల్సి వచ్చింది. తప్పకుండా పుంజుకుంటాం" అని రోహిత్ తెలిపాడు.

ఇవీ చదవండి:

IND VS AUS: నో మ్యాజిక్​.. టీమ్​ఇండియా ఓటమి.. ఆస్ట్రేలియాదే మూడో టెస్టు

టీమ్​ ఇండియాకు ఝలక్​.. ఇక డబ్ల్యూటీసీ ఫైనల్స్​కు చేరాలంటే..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.