ETV Bharat / sports

దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్​ నుంచి రాహుల్​, కుల్​దీప్​ ఔట్ - KL Rahul

d
d
author img

By

Published : Jun 8, 2022, 6:04 PM IST

Updated : Jun 8, 2022, 6:49 PM IST

18:00 June 08

దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్​ నుంచి రాహుల్​, కుల్​దీప్​ ఔట్

దక్షిణాఫ్రికాతో తొలి టీ20కి ముందు ఆటగాళ్లకు గాయాలు కావడం జట్టుకు ఆందోళన కలిగిస్తోంది. టీమ్​ఇండియాకు కీలక ఆటగాళ్లు అయిన కెప్టెన్ కేఎల్​ రాహుల్​, స్పిన్నర్​ కుల్​దీప్​ యాదవ్​లు ప్రాక్టిస్​ సెషన్​లో గాయపడ్డారు. గాయం తీవ్రంగా ఉండటం వల్ల వీరిద్దరూ సఫారీలతో జరగనున్న ఈ టీ20 సిరీస్​కు పూర్తిగా దూరమయ్యారు. ఈ మేరకు బీసీసీఐ వర్గాలు ప్రకటించాయి.

రోహిత్​ స్థానంలో కెప్టెన్సీ బాధ్యతలు అందుకున్న రాహుల్​ ఇప్పుడు జట్టుకు దూరమయ్యాడు. ఈ నేపథ్యంలో రాహుల్ స్థానంలో రిషబ్​ పంత్​కు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించింది బీసీసీఐ. వరుస టీ20 విజయాలతో ఫామ్​లో ఉన్న భారత్​.. మరో విజయం సాధిస్తే రికార్డు నెలకొల్పనుంది. ఈ సమయంలో ఇద్దరు కీలక ఆటగాళ్లు దూరం కావడంతో జట్టుకు ఎదురుదెబ్బ తగిలినట్లు అయింది.

ఇదీ చూడండి : కోచ్​పై లైంగిక​ ఆరోపణలు.. భారత సైక్లిస్ట్​ బృందం రిటర్న్​

Last Updated : Jun 8, 2022, 6:49 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.