ETV Bharat / sports

'బంగ్లా టీమ్​తో సిరీస్​ అంత ఈజీ కాదు.. ఆ విషయం ఇప్పుడే చెప్పలేం'

India Bangladesh Series 2022 : టీమ్ఇండియా కెప్టెన్​ రోహిత్​ కీలక కామెంట్లు చేశాడు. బంగ్లాదేశ్​ ఆటగాళ్లు​ ఇంతకు ముందులా లేరని.. వాళ్లతో ఆడటం చాలా ఛాలెంజింగ్​ ఉందని అన్నాడు. వాళ్లు చాలా ఇంప్రూవ్​ అయ్యారని చెప్పాడు. ఇంకా ఏమన్నాడంటే..

india bangladesh series 2022
india bangladesh series 2022
author img

By

Published : Dec 3, 2022, 6:55 PM IST

India Bangladesh Series 2022: టీమ్​ఇండియా బంగ్లాదేశ్​ సిరీస్​ ఆదివారం నుంచి మొదలవుతోంది. ఈ తరుణంలో భారత సారథి రోహిత్​ శర్మ కీలక కామెంట్లు చేశాడు. మూడు వన్డేల సిరీస్​లో..​ బంగ్లా టీమ్​తో తలపడటం అంత సులువేం కాదని చెప్పాడు. వారిపై గెలవాలంటే టీమ్​ఇండియా చాలా కష్టపడాలని అన్నాడు. కాగా మొదటి వన్డే మ్యాచ్​.. డాకాలోని 'షేర్-ఇ-బంగ్లా' జాతీయ స్టేడియం వేదికగా ఆదివారం జరగనుంది.

'చాలా సంవత్సరాలుగా ఇరు జట్ల మధ్య మంచి పోటీ ఉంది. కానీ గత 7-8 ఏళ్లుగా.. వాళ్లు (బంగ్లాదేశ్​ జట్టు) చాలా ఇంప్రూవ్ అయ్యారు. వారితో మ్యాచ్​ ఛాలెంజింగ్​గా ఉంటోంది. మాకు సులువైన విజయాలు లేవు. ఇటీవల ముగిసిన టీ20 వరల్డ్​ కప్​లో కూడా భారత్​-బంగ్లా మ్యాచ్​లో ఆఖరి వరకు ఫలితం తేలలేదు. ఈ సిరీస్​ చాలా ఎక్సైటింగ్​గా ఉండబోతోంది. వాళ్లను ఓడించడానికి మేము బాగా ఆడాలి. ఎందుకంటే వాళ్లు వారి హోం గ్రౌండ్​లో ఆడుతున్నారు' అని రోహిత్​ శర్మ చెప్పుకొచ్చారు. కాగా, న్యూజిల్యాండ్ సిరీస్‌లో విశ్రాంతి తీసుకున్న సీనియర్లు రోహిత్ శర్మ, విరాట్​ కోహ్లీ, కేఎల్​ రాహుల్ కూడా జట్టులో తిరిగి చేరారు.

ఇప్పుడే చెప్పలేం..
బంగ్లాతో వన్డే సిరీస్​.. రాబోయే వరల్డ్​ కప్​నకు​ సన్నద్ధమవుతున్నట్లు భావించవచ్చా? అన్న ప్రశ్నకు రోహిత్​ శర్మ స్పందించాడు. ఆ మెగా టోర్నీకి ఇంకా సమయం ఉందని.. దాని గురించి ఇప్పుడే ఆలోచిండడం లేదని అన్నాడు. ఇంత ముందుగా ప్లాన్​ చేస్తే అది వర్కౌట్​ కాదన్నాడు. టీమ్..​ ఏం చేయాలో, ఏ దిశలో వెళ్లాలో మేనేజ్​మెంట్​కు బాగా తెలుసు అని చెప్పాడు.

ఇవీ చదవండి : చిక్కుల్లో లక్ష్యసేన్.. వయసు విషయంలో మోసం చేశాడని ఫిర్యాదు

దీపక్​ చాహర్​కు చేదు అనుభవం.. ఆ ఎయిర్ ​లైన్స్​పై ఆగ్రహం!​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.