Ind w vs Aus w T20: భారత్- ఆస్ట్రేలియా మహిళల జట్ల మధ్య జరిగిన తొలి టీ20లో టీమ్ఇండియా గెలుపొందింది. మ్యాచ్‌లో పూర్తిగా ఆధిపత్యం చలాయించిన టీమ్ఇండియా 9 వికెట్ల తేడాతో నెగ్గింది. ఆస్ట్రేలియా నిర్దేశించిన 142 పరుగుల లక్ష్యాన్ని, టీమ్ఇండియా ఒక వికెట్ కోల్పోయి 17.3 ఓవర్లలో ఛేదించింది. ఓపెనర్లు స్మృతి మంధాన (54 పరుగులు: 52 బంతుల్లో, 7x4, 1x6), షఫాలీ వర్మ (62*పరుగులు: 44 బంతుల్లో, 6x4, 3x6) హాఫ్ సెంచరీలతో అదరగొట్టారు. ఆసీస్ బౌలర్లలో వేర్హమ్ ఒక వికెట్ దక్కించుకుంది. నాలుగు వికెట్లతో ఆసీస్‌ను దెబ్బకొట్టిన టిటాస్ సాధుకు 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు దక్కింది. ఈ విజయంతో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో 1-0 తో భారత్ ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.
-
.@JemiRodrigues with the winning runs! 😃🙌#TeamIndia win the 1st T20I by 9 wickets and take a 1⃣-0⃣ lead in the series 👏👏
— BCCI Women (@BCCIWomen) January 5, 2024 " class="align-text-top noRightClick twitterSection" data="
Scorecard ▶️ https://t.co/rNWyVNHrmk#INDvAUS | @IDFCFIRSTBank pic.twitter.com/LAVr1uo3Yl
">.@JemiRodrigues with the winning runs! 😃🙌#TeamIndia win the 1st T20I by 9 wickets and take a 1⃣-0⃣ lead in the series 👏👏
— BCCI Women (@BCCIWomen) January 5, 2024
Scorecard ▶️ https://t.co/rNWyVNHrmk#INDvAUS | @IDFCFIRSTBank pic.twitter.com/LAVr1uo3Yl.@JemiRodrigues with the winning runs! 😃🙌#TeamIndia win the 1st T20I by 9 wickets and take a 1⃣-0⃣ lead in the series 👏👏
— BCCI Women (@BCCIWomen) January 5, 2024
Scorecard ▶️ https://t.co/rNWyVNHrmk#INDvAUS | @IDFCFIRSTBank pic.twitter.com/LAVr1uo3Yl
లక్ష్య ఛేదనలో టీమ్ఇండియా ఓపెనర్లు ఆరంభం నుంచే దూకుడుగా ఆడారు. ప్రత్యర్థి బౌలింగ్‌పై ఎదురుదాడికి దిగి బౌండరీలతో విరుచుకుపడ్డారు. ఆసీస్ బౌలర్లు స్మృతి, షఫాలిని ఏ మాత్రం ఇబ్బంది పెట్టలేకపోయారు. ఓపెనర్లిద్దరూ క్రీజులో స్వేచ్ఛగా కదులుతూ బౌండరీలు బాదారు. ఈ క్రమంలోనే షఫాలీ 11.3 ఓవర్ వద్ద 32 బంతుల్లో 50 పరుగుల మార్క్ అందుకుంది. కాగా, షఫాలికి ఇది కెరీర్లో 8వ హాఫ్ సెంచరీ. మరోవైపు స్మృతి కూడా 50 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసింది. వీరిద్దరి మధ్య 15.2 ఓవర్లలో 137 పరుగుల భాగస్వామ్యం నెలకొంది. ఇక వేర్హమ్ అద్భుత బంతితో స్మృతిని ఔట్ చేసింది. కానీ, అప్పటికే టీమ్ఇండియా విజయం దాదాపు ఖరారైంది. వన్‌డౌన్‌లో వచ్చిన జెమిమా రోడ్రిగ్స్ (6*) మరో వికెట్ పడకుండా చూసుకుంది.
-
For her impressive four-wicket haul, Titas Sadhu is adjudged the Player of the Match 👏👏
— BCCI Women (@BCCIWomen) January 5, 2024 " class="align-text-top noRightClick twitterSection" data="
India win the 1st T20I by 9-wickets 👌👌
Scorecard ▶️ https://t.co/rNWyVNHrmk#TeamIndia | #INDvAUS | @IDFCFIRSTBank | @titas_sadhu pic.twitter.com/1ey5wboU6c
">For her impressive four-wicket haul, Titas Sadhu is adjudged the Player of the Match 👏👏
— BCCI Women (@BCCIWomen) January 5, 2024
India win the 1st T20I by 9-wickets 👌👌
Scorecard ▶️ https://t.co/rNWyVNHrmk#TeamIndia | #INDvAUS | @IDFCFIRSTBank | @titas_sadhu pic.twitter.com/1ey5wboU6cFor her impressive four-wicket haul, Titas Sadhu is adjudged the Player of the Match 👏👏
— BCCI Women (@BCCIWomen) January 5, 2024
India win the 1st T20I by 9-wickets 👌👌
Scorecard ▶️ https://t.co/rNWyVNHrmk#TeamIndia | #INDvAUS | @IDFCFIRSTBank | @titas_sadhu pic.twitter.com/1ey5wboU6c
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్ 19.2 ఓవర్లలో 141 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్లు హేలీ (8 పరుగులు), మూనీ (17 పరుగులు) విఫలం కాగా, వన్‌డౌన్‌లో వచ్చిన తహిళ మెక్‌గ్రాత్ (0), గార్డ్నర్ (0) పరుగుల ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరారు. ఇక ఎల్లిస్ పెర్రీ (37 పరుగులు: 30 బంతుల్లో, 2x2, 2x6), ఫోబ్ లిచ్‌ఫీల్డ్ (49 పరుగులు 32 బంతుల్లో, 4x2, 3x6) రాణించడం వల్ల ఆసీస్ 140 పరుగుల మార్క్ అదుకోగలిగింది. భారత బౌలర్లలో టిటాస్ సాధు 4, శ్రేయంక పాటిల్, దీప్తి శర్మ తలో 2, అమన్‌జోత్ కౌర్, రేణుకా సింగ్ తలో ఒక వికెట్ దక్కించుకున్నారు.
ఏకైక టెస్ట్ మ్యాచ్‌లో టీమ్ఇండియాదే పైచేయి- 347పరుగుల భారీ తేడాతో ఇంగ్లాండ్ చిత్తు
ఆఖరి మ్యాచ్‌లో విజృంభించిన అమ్మాయిలు- 5 వికెట్ల తేడాతో భారత్ విజయం