ETV Bharat / sports

IND VS WI: శ్రేయస్​, పంత్​ అదరహో.. విండీస్​ లక్ష్యం ఎంతంటే? - shreyas iyer vs westindies

IND VS WI third ODI: వెస్టిండీస్​తో జరుగుతున్న ఆఖరి వన్డేలో టీమ్​ఇండియా బ్యాటర్లు శ్రేయస్​ అయ్యారు, పంత్​ అదరగొట్టారు. ఫలితంగా భారత జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 265 పరుగులు చేసి ఆలౌట్​ అయింది.

IND VS WI third ODI teamindia innings
టీమ్​ఇండియా వర్సెస్​ వెస్టిండీస్​
author img

By

Published : Feb 11, 2022, 5:25 PM IST

IND VS WI third ODI: వెస్డిండీస్​తో జరుగుతున్న నామమాత్రపు మూడో వన్డేలో టీమ్​ఇండియా బ్యాటర్లు బాగా ఆడారు. శ్రేయస్​ అయ్యర్​(80), పంత్​(56) ఇన్నింగ్స్​ తోడవ్వడం వల్ల ప్రత్యర్థి జట్టు ముందు 266 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. దీపక్​ చాహర్​(38), వాషింగ్టన్​ సుందర్​(33) చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్​ ఆడాడు. మిగతా వారు విఫలమయ్యారు. విండీస్ బౌలర్లలో హోల్డర్​ 4, అల్జారీ జోసెఫ్​ 2, హెడెన్​ వాష్​ 2, మిగతా వారు తలో వికెట్​ దక్కించుకున్నారు.

టాస్​ గెలిచి బ్యాటింగ్​ ఎంచుకున్న టీమ్​ఇండియాకు ఆదిలోనే షాక్​ తగిలింది. అల్​జెరీ జోసెఫ్​ వేసిన నాలుగో ఓవర్​ మూడో బంతికి ఓపెనర్​, కెప్టెన్​ రోహిత్​శర్మ(13) బౌల్డ్​ అవ్వగా తర్వాత ఐదో బంతికి వన్​డౌన్​ బ్యాటర్​ కోహ్లీ(0) కీపర్​కు క్యాచ్​ ఇచ్చి డకౌట్​గా వెనుదిరిగాడు. దీంతో భారత్​ 4 ఓవర్లకే 16/2తో కష్టాల్లో పడింది.

ఆ తర్వాత శిఖర్​ ధావన్(10).. ఒడెన్​ స్మిత్​ వేసిన 9.3 బంతికి హోల్డర్​ చేతికి చిక్కి మూడో వికెట్​గా వెనుదిరిగాడు. అనంతరం ధాటిగా ఆడుతున్న పంత్​(56)... హేడెన్​ వాల్ష్​ వేసిన 30వ ఓవర్​ ఆఖరు బంతికి కీపర్​కు చిక్కి పెవిలియన్​ చేరాడు. అతడు నాలుగో వికెట్​కు శ్రేయస్​ అయ్యర్​తో కలిసి 110 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. అనంతరం ధనాధన్​ ఇన్నింగ్స్​ ఆడిన శ్రేయస్​ అయ్యర్​(80), దీపక్​ చాహర్​(38), సూర్యకుమార్​ యాదవ్​(6), కుల్దీప్​ యాదవ్(5)​ ఇలా వికెట్లను పోగొట్టుకున్నారు. చివర్ల వచ్చిన వాషింగ్​టన్​ సుందర్​(33) స్కోరు బోర్డును పరుగులెత్తించాడు.

ఇదీ చూడండి: IND VS WI: కోహ్లీ డకౌట్​.. ఫ్యాన్స్​కు మళ్లీ నిరాశే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.