IND VS WI third ODI: అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన మూడో వన్డేలోనూ టీమ్‌ఇండియా విజయం సాధించింది టీమ్‌ఇండియా. 96పరుగులు తేడాతో గెలుపొందింది. ఫలితంగా 3-0తేడాతో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను కైవసం చేసుకుంది. జట్టు సమిష్టిగా రాణించి విజయాన్ని అందుకుంది.
266 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన విండీస్‌ను టీమ్‌ఇండియా బౌలర్ల చెమటలు పట్టించారు. వారిని ఏ దశలోనూ కోలుకోనివ్వకుండా చేశారు. దీంతో ప్రత్యర్థి జట్టు 37.1 ఓవర్లలో 169 పరుగులు మాత్రమే చేసి ఆలౌట్ అయింది. ఓపెనర్లు షాయ్ హోప్(5)- బ్రాండన్ కింగ్(14), డారెన్ బ్రావో(19), షామార్హ్ బ్రూక్స్(0) తక్కువ స్కోరుకే పరిమితమయ్యారు. ఆ తర్వాత వచ్చిన నికోలస్ పూరన్(34) పర్వాలేదనిపించాడు. చివర్లో వచ్చిన ఒడియన్ స్మిత్(36), అల్జారీ జోసెఫ్(29), హేడెన్ వాష్(13) కాసేపు మన బౌలర్ల సహనాన్ని పరీక్షించారు. టీమ్‌ఇండియా బౌలర్లలో మహ్మద్ సిరాజ్ 3, ప్రసిద్ధ కృష్ణ 3, కుల్దీప్ యాదవ్ 2, దీపక్ చాహర్ 2 వికెట్లను దక్కించుకున్నారు.
అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన టీమ్‌ఇండియా బ్యాటర్లు బాగా ఆడారు. అయితే మన జట్టుకు ఆదిలోనే షాక్ తగిలింది. అల్జెరీ జోసెఫ్ వేసిన నాలుగో ఓవర్ మూడో బంతికి ఓపెనర్, కెప్టెన్ రోహిత్‌శర్మ(13) బౌల్డ్ అవ్వగా తర్వాత ఐదో బంతికి వన్‌డౌన్ బ్యాటర్ కోహ్లీ(0) కీపర్‌కు క్యాచ్ ఇచ్చి డకౌట్‌గా వెనుదిరిగాడు. దీంతో భారత్ 4 ఓవర్లకే 16/2తో కష్టాల్లో పడింది.
ఆ తర్వాత శిఖర్ ధావన్(10).. ఒడెన్ స్మిత్ వేసిన 9.3 బంతికి హోల్డర్ చేతికి చిక్కి మూడో వికెట్‌గా వెనుదిరిగాడు. అనంతరం ధాటిగా ఆడుతున్న పంత్(56)... హేడెన్ వాల్ష్ వేసిన 30వ ఓవర్ ఆఖరు బంతికి కీపర్‌కు చిక్కి పెవిలియన్ చేరాడు. అతడు నాలుగో వికెట్‌కు శ్రేయస్ అయ్యర్‌తో కలిసి 110 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. అనంతరం ధనాధన్ ఇన్నింగ్స్ ఆడిన శ్రేయస్ అయ్యర్(80), దీపక్ చాహర్(38), సూర్యకుమార్ యాదవ్(6), కుల్దీప్ యాదవ్(5) ఇలా వికెట్లను పోగొట్టుకున్నారు. చివర్ల వచ్చిన వాషింగ్టన్ సుందర్(33) స్కోరు బోర్డును పరుగులెత్తించాడు.
రికార్డులు
- ద్వైపాక్షిక సిరీస్‌ల్లో వెస్టిండీస్‌పై వన్డే సిరీస్ వైట్‌వాష్ చేసిన భారత తొలి సారథిగా హిట్‌మ్యాన్ రికార్డు నెలకొల్పాడు.
- 2017లో టీమ్‌ఇండియా కోహ్లీ సారథ్యంలో చివరిసారి శ్రీలంకపై వన్డే సిరీస్ వైట్‌వాష్ చేసింది. ఆ తర్వాత ఇతర జట్లపై ఇలాంటి అవకాశం రాలేదు.
- వన్డే సిరీస్‌లు వైట్‌వాష్ చేసిన టీమ్‌ఇండియా కెప్టెన్ల జాబితాలో హిట్‌మ్యాన్ ఏడో సారథిగా నిలిచాడు. అంతకుముందు కపిల్, దిలీప్ వెంగ్‌సర్కార్, మహ్మద్ అజాహరుద్దీన్, గౌతమ్ గంభీర్, ధోనీ, కోహ్లీల సారథ్యంలో భారత జట్టు ఆ ఘనత సాధించింది.
- ధోనీ, కోహ్లీ సారథ్యంలో టీమ్‌ఇండియా మాత్రమే మూడేసి సార్లు ప్రత్యర్థులపై వన్డేల్లో వైట్‌వాష్ చేసింది.
ఇదీ చూడండి: IND VS WI: శ్రేయస్, పంత్ అదరహో.. విండీస్ లక్ష్యం ఎంతంటే?