Ind vs Wi T20 :విండీస్‌తో జరిగిన రెండో టీ20లో టీమ్ఇండియా 2 వికెట్ల తేడాతో ఓడింది. మొదట బ్యాటింగ్ చేసిన భారత్.. నిర్ణిత 20 ఓవర్లకు 7 వికెట్ల నష్టానికి 152 పరుగులు చేసింది. అనంతరం అతిథ్య జట్టు 18.5 ఓవర్లలోనే టార్గెట్‌ను ఛేదించింది. 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్' విన్నర్.. విండీస్ డేంజరస్ బ్యాటర్ నికోలస్ పూరన్ (67 పరుగులు: 40 బంతుల్లో, 6x4,4x6) బ్యాట్‌తో విధ్వంసం సృష్టించి.. తమ జట్టుకు విజయం కట్టబెట్టాడు. దీంతో భారత్ వరుసగా రెండో ఓటమిని మూటగట్టుకొని ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 2-0తో వెనుకబడిపోయింది.
-
A close game in the end in Guyana!
— BCCI (@BCCI) August 6, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
West Indies win the 2nd T20I by 2 wickets.
Scorecard - https://t.co/9ozoVNatxN#TeamIndia | #WIvIND pic.twitter.com/jem0j9gMzv
">A close game in the end in Guyana!
— BCCI (@BCCI) August 6, 2023
West Indies win the 2nd T20I by 2 wickets.
Scorecard - https://t.co/9ozoVNatxN#TeamIndia | #WIvIND pic.twitter.com/jem0j9gMzvA close game in the end in Guyana!
— BCCI (@BCCI) August 6, 2023
West Indies win the 2nd T20I by 2 wickets.
Scorecard - https://t.co/9ozoVNatxN#TeamIndia | #WIvIND pic.twitter.com/jem0j9gMzv
పూరన్ బాదేశాడు..
టీమ్ఇండియా బౌలర్లు రెండో ఇన్నింగ్స్‌ను ఘనంగానే ఆరంభించారు. కెప్టెన్ హార్దిక్ పాండ్య.. తొలి ఓవర్లోనే రెండు వికెట్లు నేలకూల్చాడు. మొదటి బంతికే విండీస్ ఓపెనర్ బ్రెండన్ కింగ్‌ను పెవిలియన్ చేర్చగా.. నాలుగో బంతికి చార్లెస్‌ను ఎల్బీగా ఔట్ చేశాడు. దీంతో నాలుగో వికెట్‌గా క్రీజులోకి వచ్చిన పూరన్ జట్టును ఆదురునే బాధ్యతలు తీసుకున్నాడు. ఎడాపెడా బౌండరీలు బాదుతూ.. భారత బౌలర్లకు చుక్కలు చూపించాడు.
స్పిన్నర్ రవి బిష్ణోయ్ బౌలింగ్‌లో అయితే ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ఈ ఓవర్లో పూరన్.. 3 ఫోర్లు, 1 సిక్స్‌తో 18 పరుగులు పిండుకున్నాడు. ఈ క్రమంలో హార్దిక్ మళ్లీ భారత్‌కు బ్రేక్ ఇచ్చాడు. రోమన్ పావెల్ (21)ను ఔట్ చేశాడు. కానీ అప్పటికీ విండీస్ సాధించాల్సిన రన్‌రేట్ పెద్దగా ఏమీలేదు. ఇక పావెల్ ఔట్ అయిన వెంటనే క్రీజులోకి వచ్చిన హెట్మయర్ (22).. పూరన్‌తో జత కట్టాడు. తర్వాత పూరన్, హెట్మయర్, షెఫర్డ్ (0), హోల్డర్ (0) వికెట్లు తీసిన భారత్.. పోటీలోకి వచ్చినట్టు కనిపించింది. కానీ విండీస్ లోయార్డర్ బ్యాటర్లు అకీల్ (16*), జోసెఫ్ (10*)లు తమ పోరాటంతో జట్టును విజయ తీరాలకు చేర్చారు. భారత బౌలర్లలో పాండ్య 3, చాహల్ 2, అర్షదీప్, బిష్ణోయ్ తలో వికెట్ పడగొట్టారు.
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్‌కు.. ఆశించిన ఆరంభం లభించలేదు. శుభ్‌మన్ గిల్ (7) మరోసారి నిరాశ పర్చగా.. వన్ డౌన్లో వచ్చిన సూర్య కుమార్ యాదవ్ (1) రనౌటయ్యాడు. దీంతో 18 పరుగులకే భారత్ రెండు కీలక వికెట్లు కోల్పోయింది. అనంతరం బ్యాటింగ్‌కు వచ్చిన తిలక్ వర్మ(51; 41 బంతుల్లో 4x5, 1x6) తో కలిసి.. మరో ఓపెనర్ ఇషాన్ కిషన్ (27) ఫర్వాలేదనిపించాడు.
కాగా మరోవైపు తిలక్ మరోసారి కీలకమైన ఇన్నింగ్స్ ఆడాడు. అంతర్జాతీయ కెరీర్లో తొలి హాఫ్ సెంచరీ అందుకున్నాడు. తిలక్ ఔటైన తర్వాత హార్దిక్ (24) జట్టుకు భారీ స్కోర్ అందించే ప్రయత్నం చేశాడు. కానీ జోసెఫ్ బౌలింగ్‌లో క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. ఆఖర్లో బౌలర్లు అర్ష్‌దీప్ ఓ ఫోర్, బిష్ణోయ్ సిక్స్ కొట్టడం వల్ల జట్టు స్కోర్ 150 పరుగులు దాటింది. వింజీస్ బౌలర్లలో జోసెఫ్, అకీల్, షెపర్డ్ తలో రెండు వికెట్లు పడగొట్టారు. కాగా ఇరుజట్ల మధ్య మంగళవారం మూడో టీ20 మ్యాచ్ జరగనుంది.
ఇవి చదవండి :
Ind vs Wi T20 : ఆసక్తికరంగా రెండో టీ20.. ఈ మ్యాచ్‌లోనైనా కుర్రాళ్లు కొట్టేస్తారా?
Ind Vs WI T20 : టీమ్ఇండియా @200.. టీ20ల్లో మన స్టార్ ప్లేయర్ల రికార్డులు తెలుసా?