ETV Bharat / sports

వెస్టిండీస్​తో సిరీస్​.. ఫ్యాన్స్​కు గుడ్​ న్యూస్​ - టీమ్​ఇండియా వర్సెస్​ దక్షిణాఫ్రికా

IND Vs WI: వెస్టిండీస్​తో జరగనున్న మూడు మ్యాచ్​ల టీ20 సిరీస్​కు ప్రేక్షకులను అనుమతించనున్నారు. స్టేడియంలో సామర్థ్యంలో 75 శాతం మంది అభిమానులను అనుమతించేలా బంగాల్​ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

IND Vs WI
IND Vs WI
author img

By

Published : Feb 1, 2022, 2:01 PM IST

Updated : Feb 1, 2022, 2:56 PM IST

IND Vs WI: క్రికెట్​ అభిమానులకు శుభవార్త. స్వదేశ్వంలో వెస్టిండీస్​తో జరగనున్న మూడు మ్యాచ్​ల టీ20 సిరీస్​కు అభిమానులను అనుమతించనున్నారు. ఈ మ్యాచులకు ఆతిథ్యం ఇవ్వనున్న ఈడెన్​ గార్డెన్స్​కు 75 శాతం మంది ప్రేక్షకులను అనుమతించాలన్న ప్రతిపాదనను పశ్చిమ బంగాల్​ ప్రభుత్వం అంగీకరించింది. ఈ మ్యాచ్​లకు సుమారు 50 వేల మంది హాజరయ్యే అవకాశం ఉంది. తొలి టీ20 మ్యాచ్​ ఫిబ్రవరి 16న జరగనుంది.

చారిత్రక మ్యాచ్​కు ప్రేక్షకులు దూరం..

భారత పర్యటనలో భాగంగా విండీస్​ జట్టు మొత్తంగా మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడనుంది. అహ్మదాబాద్​ వేదికగా మూడు మ్యాచ్​ల వన్డే సిరీస్​ జరగనుంది. ప్రస్తుతం నెలకొన్న కొవిడ్ పరిస్థితుల దృష్ట్యా వన్డే సిరీస్​కు ప్రేక్షకులను అనుమతించడం లేదని గుజరాత్ క్రికెట్ సంఘం మంగళవారం తెలిపింది.

కాగా, ఫిబ్రవరి 6న జరగబోయే తొలి వన్డే.. భారత క్రికెట్​లో ఎంతో ప్రత్యేకమైనది. అది టీమ్​ఇండియా ఆడబోయే 1000వ వన్డే మ్యాచ్​. దీంతో ఆ ఘనత సాధించే తొలి జట్టుగా నిలవనుంది భారత్.

ఇదీ చూడండి: సర్ఫర్ సోయగాలు.. మరీ ఇంత హాట్ ​గానా!

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!

Last Updated : Feb 1, 2022, 2:56 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.