ETV Bharat / sports

IND VS WI: కెప్టెన్సీలో కోహ్లీ రికార్డును అధిగమించిన రోహిత్ - కోహ్లీ రోహిత్ శర్మ లేటెస్ట్ న్యూస్

IND VS WI: వెస్టిండీస్​తో జరిగిన వన్డే సిరీస్​ను క్లీన్​స్వీప్ చేసింది టీమ్​ఇండియా. అయితే ఈ సిరీస్​లో కెప్టెన్ రోహిత్​ శర్మ పలు రికార్డులను నెలకొల్పాడు. అవేంటో మీరే చూడండి..

kohli record was beaten by rohit sharma
కోహ్లీ రోహిత్ శర్మ
author img

By

Published : Feb 11, 2022, 10:50 PM IST

IND VS WI: ద్వైపాక్షిక సిరీస్‌ల్లో వెస్టిండీస్‌పై వన్డే సిరీస్‌ వైట్‌వాష్‌ చేసిన భారత తొలి సారథిగా హిట్‌మ్యాన్‌ రికార్డు నెలకొల్పాడు. 2017లో టీమ్‌ఇండియా కోహ్లీ సారథ్యంలో చివరిసారి శ్రీలంకపై వన్డే సిరీస్‌ వైట్‌వాష్‌ చేసింది. ఆ తర్వాత ఇతర జట్లపై ఇలాంటి అవకాశం రాలేదు.

వన్డే సిరీస్‌లు వైట్‌వాష్‌ చేసిన టీమ్‌ఇండియా కెప్టెన్ల జాబితాలో హిట్‌మ్యాన్‌ ఏడో సారథిగా నిలిచాడు. అంతకుముందు కపిల్‌ దేవ్, దిలీప్‌ వెంగ్‌సర్కార్‌, మహ్మద్‌ అజాహరుద్దీన్‌, గౌతమ్‌ గంభీర్‌, ధోనీ, కోహ్లీల సారథ్యంలో భారత జట్టు ఆ ఘనత సాధించింది.

ధోనీ, కోహ్లీ సారథ్యంలో టీమ్‌ఇండియా మాత్రమే మూడేసి సార్లు ప్రత్యర్థులను వన్డేల్లో వైట్‌వాష్‌ చేసింది.

కోహ్లీని అధిగమించిన రోహిత్

రోహిత్​ ఇప్పటివరకు 13 వన్డేలకు సారథ్యం వహించాడు. ఇందులో 11 గెలిచాడు. సారథిగా కోహ్లీ తొలి 13 వన్డేల్లో 10 మ్యాచుల్లో విజయం సాధించాడు. క్లైవ్​ లాయిడ్, ఇంజూమామ్​ ఉల్​ హక్​, మిషబ్​ ఉల్​ హక్​ 12 గెలిచారు.

ప్రసిద్ధ్ కృష్ణ రికార్డు

టీమ్​ఇండియా యవ పేసర్​ ప్రసిద్ధ్ కృష్ణ కొత్త చరిత్ర సృష్టించాడు. టీమ్​ఇండియా తరఫున మొదటి ఏడు వన్డేల్లో అత్యధిక వికెట్లు తీసిన తొలి బౌలర్​గా రికార్డుకెక్కాడు. ఇప్పటివరకు అతడు ఆడిన ఏడు వన్డేల్లో 18 వికెట్లు దక్కించుకున్నాడు. ఈ జాబితాలో అజిత్​ అగార్కర్​, బుమ్రా(16 వికెట్లు), మాజీ ప్లేయర్​ ప్రవీణ్​ కుమార్​(15), నరేంద్ర హిర్వాణి, జహీర్​ ఖాన్​, రవిచంద్రన్​ అశ్విన్​(14) ఉన్నారు.

వెస్టిండీస్ చెత్త రికార్డు..

టీమ్​ఇండియా చేతిలో క్లీన్​స్వీప్​ అయిన వెస్టిండీస్​ ఓ చెత్త రికార్డును ఖాతాలో వేసుకుంది. 2019-22 మధ్య కాలంలో విండీస్​ విదేశాల్లో క్లీన్​స్వీప్​ కావడం ఇది 11వ సారి. 1999-00 మధ్య కాలంలో 9 సిరీస్​లో వైట్​వాష్​ అయిన విండీస్​.. 2009-10 మధ్య 8 సిరీస్​లో క్లీన్​స్వీప్​ అయింది.

ఇదీ చూడండి: IND VS WI: విండీస్​పై టీమ్​ఇండియా విక్టరీ.. సిరీస్​ క్లీన్​స్వీప్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.