ETV Bharat / sports

IND VS WI: భారత్ ధమాకా.. విండీస్​పై ఘన విజయం

విండీస్​తో వన్డే సిరీస్​లో టీమ్​ఇండియా బోణీ కొట్టింది. బ్యాటింగ్​లో రోహిత్ శర్మ.. బౌలింగ్​లో చాహల్ చెలరేగిన వేళ.. ఘన విజయం సాధించింది.

team india
టీమ్​ఇండియా
author img

By

Published : Feb 6, 2022, 7:41 PM IST

Team india: 1000వ వన్డేలో భారత్ ఘనవిజయం సాధించింది. వెస్టిండీస్​తో జరిగిన ఈ మ్యాచ్​లో 6 వికెట్ల తేడాతో గెలిచింది. అర్ధ సెంచరీ చేసిన రోహిత్ శర్మ.. అటు కెప్టెన్​, బ్యాటర్​గా తన మార్క్​ చూపించాడు.

అహ్మదాబాద్​లో మోదీ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్​లో 177 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన టీమ్​ఇండియా.. 28 ఓవర్లలో దానిని పూర్తి చేసింది. అంతకు ముందు బ్యాటింగ్​లో ఆరంభం నుంచే అదరగొట్టింది. ఓపెనింగ్ జోడీ రోహిత్ శర్మ-ఇషాన్ కిషన్.. తొలి వికెట్​కు 84 పరుగులు జోడించారు. అనంతరం 60 పరుగులు చేసిన రోహిత్ ఔటయ్యాడు.

captain rohit sharma
కెప్టెన్ రోహిత్ శర్మ

మాజీ కెప్టెన్ కోహ్లీ.. కేవలం 8 పరుగులే చేసి పెవిలియన్​ చేరాడు. మిగిలిన బ్యాటర్లలో ఇషాన్ కిషన్ 28, పంత్ 11, సూర్యకుమార్ యాదవ్ , దీపక్ హుడా పరుగులు చేశారు. విండీస్ బౌలర్లలో జోసెఫ్ 2, హుసేన్ ఓ వికెట్ తీశారు.

అంతకు ముందు టాస్ ఓడి బ్యాటింగ్​కు దిగిన వెస్టిండీస్​.. ప్రారంభం నుంచే వికెట్లు కోల్పోయింది. మన బౌలర్ల స్పిన్​ మాయాజాలానికి చిక్కిన కరీబియన్లు.. 176 పరుగులకే ఆలౌట్​ అయ్యారు. హోల్డర్ అత్యధికంగా 57 పరుగులు చేశాడు. భారత బౌలర్లలో చాహల్ 4, సుందర్ 3, ప్రసిద్ధ్ 2, సిరాజ్ ఓ వికెట్ తీశారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.