ETV Bharat / sports

కోహ్లీ మాస్టర్​ ప్లాన్​.. దెబ్బకు పొలార్డ్​ డకౌట్​! - రోహిత్​ శర్మ

IND vs WI First ODI 2022: విండీస్​తో తొలి వన్డేలో చాహల్​ అద్భుతంగా బౌలింగ్​ చేశాడు. ఈ మ్యాచ్​లో చాహల్​ పొలార్డ్​ వికెట్​ తీయడం ప్రత్యేకంగా నిలిచింది. దీని వెనుక రన్​మెషీన్​ కోహ్లీ ఉన్నట్లు తెలుస్తోంది. విరాట్​ ఇచ్చిన సలహాను పాటించిన చాహల్​.. పొలార్డ్​ను డకౌట్​ చేశాడు.

IND vs WI First ODI 2022
విరాట్​ కోహ్లీ
author img

By

Published : Feb 6, 2022, 6:07 PM IST

IND vs WI First ODI 2022: భారత్​-విండీస్​ తొలివన్డేలో స్పిన్నర్​ చాహల్​ విజృంభించాడు. తన స్పిన్​ మాయాజాలంతో విండీస్​ బ్యాటర్లను ఉక్కిరిబిక్కరి చేశాడు. హోల్డర్​ మినహా ఓపెనర్ల నుంచి టెయిలెండర్ల వరకు ఎవరూ చాహల్​ ధాటికి నిలువలేకపోయారు. అయితే చాహల్​ తీసిన 4 వికెట్లలో కీలకమైనది, క్రికెట్​ అభిమానులను ఆకట్టుకున్నది విండీస్​ కెప్టెన్​ పొలార్డ్​ను ఔట్​ చేయడం. ప్రమాదకర బ్యాటర్​ అయిన పొలార్డ్​ను తొలి బంతికే చాహల్​ పెవిలియన్​ పంపించిన తీరుకు అందరూ ఆశ్చర్యపోయారు. అయితే దీని వెనుక టీమ్​ఇండియా మాజీ కెప్టెన్​ విరాట్​ కోహ్లీ ప్లాన్ ఉందని తెలుస్తోంది.

ఉల్టా వాలా డాల్​..

అప్పటికే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న విండీస్​ను తన విధ్వంసకర బ్యాటింగ్​తో ఆదుకుని స్కోరు బోర్డును పరగులు పెట్టించాలనే లక్ష్యంతో పొలార్డ్​ క్రీజులోకి అడుగుపెట్టాడు. అప్పటికే రెండు వికెట్లు తీసి మంచి ఫామ్​లో చాహల్​కు కెప్టెన్​ రోహిత్​ బంతిని అందించాడు. పొలార్డ్ నిలిస్తే ప్రమాదమని గుర్తించి అతడిని ఎలా వెనక్కి పంపించాలో అప్పటికే ప్లాన్​ వేసిన మాజీ కెప్టెన్​ విరాట్​ కోహ్లీ చాహల్​ వద్దకు వచ్చాడు. "ఉల్టా వాలా డాల్​, బిందాస్​ డాల్​" (గూగ్లీ వేయి, ఏం కంగారు పడకు) అంటూ సూచన చేశాడు. కోహ్లీ సూచనను పాటిస్తూ చాహల్​ గూగ్లీ వేశాడు.. అంతే ప్లాన్​ సక్సెస్​. షాట్​ ఆడేందుకు ప్రయత్నించిన పొలార్డ్ వికెట్లకు దొరికిపోయాడు.

ఫ్యాన్స్​ ఖుషీ..

పొలార్డ్​ వికెట్​తో టీమ్​ఇండియా సంబరాలు చేసుకుంది. ఈ వికెట్​పై అభిమానులు సోషల్​మీడియా తమదైన శైలిలో స్పందించారు. అయితే అందరి దృష్టిని ఆకర్షించింది మాత్రం రోహిత్​-కోహ్లీ సెలబ్రేషన్స్​. వికెట్​ పడగానే వారు ఇద్దరూ కలిసి సంబరాలు చేసుకుంటున్న వీడియోను తెగ షేర్​ చేస్తున్నారు టీమ్​ఇండియా అభిమానులు. ఇద్దరి మధ్య మనస్పర్థలు ఉన్నాయంటూ వార్తలు చక్కర్లుకొట్టిన నేపథ్యంలో కెప్టెన్సీ మార్పు తర్వాత వీరిద్దరూ జట్టులో ఎలా నడుచుకుంటారు అనే సందేహం అభినానుల్లో ఉండేది. ఈ నేపథ్యంలో ఇప్పుడు వీరిలా కలిసి సెలబ్రేషన్స్​ చేసుకోవడం చూసి అభిమానులు సంతోషపడిపోతున్నారు.

ఇదీ చూడండి : Rohit Sharma: '1000వ వన్డేకు కెప్టెన్సీ చేయడం నా అదృష్టం'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.