India vs West Indies: వెస్టిండీస్‌తో మూడో టీ20లో టాస్ గెలిచిన వెస్టిండీస్ బౌలింగ్ ఎంచుకుంది. దీంతో భారత్ బ్యాటింగ్‌కు దిగనుంది. ఇప్పటికే రెండు మ్యాచ్‌లు గెలిచి సిరీస్ సొంతం చేసుకున్న రోహిత్‌సేన.. మూడో టీ20లోనూ విజయం సాధించి మరో వైట్‌వాష్ చేయాలని భావిస్తోంది.
అవేశ్ ఖాన్ అరంగేట్రం
ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరుతున్న ఈ మ్యాచ్‌కు భారత్ జట్టులో భారీ మార్పులు జరిగాయి. మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీతో పాటు రిషబ్ పంత్‌కు విశ్రాంతి ఇవ్వగా.. ఈ మ్యాచ్‌లో భువనేశ్వర్ కుమార్, చాహల్‌ను పక్కన పెట్టారు. దీంతో రిజర్వ్ బెంచ్ ఆటగాళ్లకు అవకాశం లభించింది. యువ ఆటగాళ్లు రుతురాజ్ గైక్వాడ్, శ్రేయస్ అయ్యర్‌లకు చోటు లభించగా.. ఈ మ్యాచ్‌తోనే అవేశ్ ఖాన్ అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేయనున్నాడు.
మూడు వన్డేల సిరీస్‌తో వైట్‌వాష్ అయిన విండీస్.. టీ20 సిరీస్‌ను కూడా కోల్పోయింది. కనీసం ఈ ఒక్క మ్యాచ్‌లో అయినా గెలిచి పరువు నిలబెట్టుకోవాలని కరీబియన్ జట్టు భావిస్తోంది.
జట్లు ఇవే..
భారత్ జట్టు
రుతురాజ్ గైక్వాడ్, ఇషాన్ కిషాన్(కీపర్), రోహిత్ శర్మ(కెప్టెన్), శ్రేయస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, వెంకటేశ్ అయ్యర్, దీపక్ చాహార్, శార్దుల్ ఠాకూర్, హర్షల్ పటేల్, రవి బిష్ణోయ్, అవేశ్ ఖాన్
వెస్టిండీస్ జట్టు
కైల్ మేయర్స్, షాయ్ హోప్, నికోలస్ పూరన్(కీపర్), రోవ్‌మన్ పావెల్, కీరన్ పొలార్డ్(కెప్టెన్), జాసన్ హోల్డర్, రోస్టన్ చేజ్, రొమారియో షెపర్డ్, డొమినిక్ డ్రేక్స్, ఫాబియన్ అలెన్, హేడెన్ వాల్ష్
ఇదీ చూడండి: రంజీల్లో యశ్ ధుల్ రికార్డు.. మూడో క్రికెటర్‌గా ఘనత