ETV Bharat / sports

వరల్డ్​ కప్​లో లంక జట్టు చెత్త రికార్డు - ఒక్క పరుగుకే నాలుగు వికెట్లు!

IND VS SL World Cup Record : వన్డే ప్రపంచకప్​లో భాగంగా భారత్​- శ్రీలంక మధ్య జరిగిన మ్యాచ్​లో లంక జట్టు ఘోర పరాభవాన్ని ఎదుర్కొంది. ఈ క్రమంలో ఈ జట్టు ఓ చెత్త రికార్డును తమ ఖాతాలో వేసుకుంది. ఇంతకీ అదేంటంటే..

IND VS SL World Cup Record
IND VS SL World Cup Record
author img

By ETV Bharat Telugu Team

Published : Nov 3, 2023, 7:41 AM IST

IND VS SL World Cup Record : వన్డే ప్రపంచకప్​లో భాగంగా గురువారం(నవంబర్​ 2)న భారత్​- శ్రీలంక మధ్య హోరా హోరీ మ్యాచ్​ జరిగింది. తొలుత బ్యాటింగ్​కు దిగిన టీమ్​ఇండియా నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 357 పరుగులు చేసింది. ఇక భారత్​ నిర్దేశించిన ఈ టార్గెట్​ను ఛేదించలేక శ్రీలంక 55 పరుగులకే ఘోర పరాభవాన్ని ఎదుర్కొంది. అయితే ఈ వేదికగా ఎన్నో మంచి రికార్డులతో పాటు కొన్ని చెత్త రికార్డులు కూడా నమోదయ్యాయి. అవేంటంటే..

భారత్​ నిర్దేశించిన లక్ష్యాన్ని ఛేదించేందుకు దిగిన లంక జట్టుకు ఆదిలోనే షాక్​ తగిలింది. తొలి బంతికే ఓపెనర్లిద్దరూ పెవిలియన్​ బాట పట్టారు. ఇక వరుసగా లంక జట్టు వికెట్లు పడటం మొదలైంది. కేవలం 3 పరుగుల స్కోర్​కే 4 వికెట్లు కోల్పోయింది. అందులో 2 పరుగులు ఎక్స్‌ట్రాలు కాగా.. ఒకటి మాత్రమే బ్యాట్‌తో వచ్చింది.

అయితే క్రికెట్​ హిస్టరీలో ఇలా జరగటం తొలిసారి ఏం కాదు.. 2015లో వెస్టిండీస్‌పై కేవలం 1 పరుగు చేసి 4 వికెట్లను పాకిస్థాన్ జట్టు కోల్పోయి.. ఈ చెత్త రికార్డులో టాప్​ పొజిషన్​లో ఉంది. ఇక ఆ తర్వాతి స్థానంలో ఒక్క పరుగు చేసి నాలుగు వికెట్లు కోల్పోయిన శ్రీలంక జట్టు ఈ లిస్ట్​లో రెండో స్థానంలో నిలిచింది.

2007లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో కేవలం 2 పరుగులకే టాప్ 4 వికెట్లు కోల్పోయిన ఐర్లాండ్ జట్టు మూడో స్థానంలో నిలవగా.. 1993లో వెస్టిండీస్‌పై కేవలం 3 పరుగులు మాత్రమే చేసి 4 వికెట్లు కోల్పోయిన పాకిస్థాన్ క్రికెట్ మరోసారి నాలుగో స్థానాన్ని అందుకుంది. ఇక 2018లో ఆస్ట్రేలియాపై కేవలం 3 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ జట్టు ఐదవ స్థానంలో ఉంది.

IND Vs SL World Cup 2023: ఖాతా కూడా తెరవకుండానే ఓ వికెట్​ 14 పరుగులకే ఆరు వికెట్లు. గురువారం జరిగిన మ్యాచ్​లో భారత బౌలర్ల ధాటికి శ్రీలంక విలవిల్లాడిపోయింది. షమి (5/18), సిరాజ్‌ (3/16), బుమ్రా (1/8) తమ బౌలింగ్​ స్కిల్స్​తో ప్రత్యర్థులను హడలెత్తించిన వేళ.. లంక జట్టుకు ఏం చేయలేని పరిస్థితి ఏర్పడింది. వరుస వికెట్లతో డీలా పడ్డ ఆ జట్టుకు సింగిల్స్‌ తీయడమే కష్టంగా మారింది. దీంతో శ్రీలంక 19.4 ఓవర్లలకు 55 పరుగులు చేసి ఘోర పరాభవాన్ని ఎదుర్కొంది.

భారత బౌలర్ల ధాటికి శ్రీలంక బెంబేలు- 55 పరుగులకే ఆలౌట్​

అదరగొట్టిన షమీ, చిత్తుగా ఓడిన శ్రీలంక- రికార్డ్ విజయంతో సెమీస్​లోకి భారత్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.