ETV Bharat / sports

IND VS SL Test: గులాబీ టెస్టులో ఈ రికార్డులు బ్రేక్ అవుతాయా?

author img

By

Published : Mar 12, 2022, 5:08 AM IST

IND VS SL Test: శ్రీలంకతో బెంగళూరు వేదికగా నేడు (శనివారం) రెండో టెస్టు ప్రారంభంకానుంది. మ్యాచ్​ గెలిచి గౌరవం కాపాడుకోవాలని లంక.. సిరీస్​ క్లీన్​స్వీప్​ చేయాలని టీమ్​ఇండియా భావిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఇరు జట్లలోని పలువురు ఆటగాళ్లు కొన్ని రికార్డులకు చేరువలో ఉన్నారు. వాటిపై ఓ లుక్కేయండి.

IND VS SL Test
IND VS SL

IND VS SL Test: బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా శ్రీలంకతో రెండో టెస్టుకు సిద్ధమైంది టీమ్​ఇండియా. శనివారం (మార్చి 12) ఈ డేనైట్​ టెస్టు ప్రారంభంకానుంది. తొలి టెస్టులో భారీ విజయాన్ని నమోదు చేసిన భారత్​.. ఈ గులాబీ టెస్టులోనూ గెలిచి రెండు మ్యాచ్​ల సిరీస్​ను క్లీన్​స్వీప్ చేయాలని భావిస్తోంది. ఈ క్రమంలోనే పలువురు రికార్డులకు చేరువయ్యారు ఇరు జట్లు క్రికెటర్లు. ఈ మ్యాచ్​లో వాటిని చేరుకుంటారో లేదో చూడాలి.

IND VS SL
రోహిత్
  • భారత కెప్టెన్​ రోహిత్​ శర్మ మరో 3 క్యాచులు పడితే.. టెస్టుల్లో 50 క్యాచులు పట్టిన ఆటగాడిగా రికార్డు సృష్టిస్తాడు.
  • టీమ్​ఇండియా స్పిన్నర్​ రవిచంద్రన్​ అశ్విన్ మరో నాలుగు వికెట్లు తీస్తే దక్షిణాఫ్రికా పేసర్ డేల్ స్టేయిన్​ను అధిగమిస్తాడు. దీంతో టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన ఎనిమిదో బౌలర్​గా ఘనత వహిస్తాడు.
  • శ్రీలంక ఆటగాడు డిక్వెల్లా టెస్టుల్లో 2500 పరుగులకు నాలుగు పరుగుల దూరంలో ఉన్నాడు.
  • భారత ఆల్​రౌండర్​ రవీంద్ర జడేజా మరో 9 వికెట్లు తీస్తే టెస్టుల్లో 250 వికెట్ల క్లబ్​లో చేరతాడు.
  • హిట్​మ్యాన్​ రోహిత్​ శర్మ ఈ మ్యాచ్​తో అన్ని ఫార్మాట్లలో కలిపి అంతర్జాతీయంగా 400 మ్యాచులను పూర్తి చేసుకుంటాడు.
  • రవీంద్ర జడేజా టెస్టుల్లో 2500 పరుగుల మార్కును చేరుకోవడానికి 130 పరుగుల దూరంలో ఉన్నాడు.
  • భారత వికెట్​కీపర్​ రిషభ్​ పంత్​ ఎనిమిది సిక్సర్లు కొడితే.. సుదీర్ఘ ఫార్మాట్​లో 50 సిక్సర్ల జాబితాలో చేరతాడు.
    IND VS SL
    పంత్
  • అంతర్జాతీయ మ్యాచుల్లో 650 బౌండరీలకు దిముత్​ కరుణరత్నే 5 ఫోర్ల దూరంలో ఉన్నాడు.
  • రవిచంద్రన్ అశ్విన్​ 95 పరగులు చేస్తే టెస్టుల్లో 3వేల పరుగులను చేరుకుంటాడు.
  • ఈ మ్యాచ్​తో 250 అంతర్జాతీయ మ్యాచులను పూర్తిచేసుకుంటాడు అశ్విన్​.
  • శ్రీలంక ఆటగాడు విశ్వ ఫెర్నాండో 8 వికెట్లు తీస్తే టెస్టుల్లో 50 వికెట్లను పూర్తిచేసుకుంటాడు.
  • జస్ప్రీత్​​ బుమ్రా అంతర్జాతీయ మ్యాచుల్లో 300 వికెట్లకు 5 వికెట్ల దూరంలో ఉన్నాడు.
    IND VS SL
    బుమ్రా
  • దినేశ్​ చండిమాల్​ విదేశాల్లో 2500 పరుగుల మార్క్​ సాధించాలంటే మరో 84 పరుగులు చేయాలి.
  • ధనుంజయ డిసిల్వా టెస్టు మ్యాచుల్లో 300 ఫోర్లకు ఒక్క బౌండరీ దూరంలో ఉన్నాడు.
  • ఎంజెలో మాథ్యూస్​ అన్ని ఫార్మాట్లలో కలిపి 300 సిక్సర్లకు నాలుగు సిక్సర్ల దూరంలో ఉన్నాడు.
  • కుశాల్​ మెండిస్​ అన్ని ఫార్మాట్లలో కలిపి 6000 పరగుల మైలురాయిని చేరుకోవడానికి మరో 43 పరుగులు అవసరం.
  • రిషభ్​ పంత్​ తొమ్మిది ఫోర్లు కొడితే టెస్టుల్లో 200 బౌండరీలు సాధిస్తాడు.
  • డిసిల్వా మరో 4 క్యాచులు పడితే టెస్టుల్లో 50 క్యాచులను పూర్తి చేసుకుంటాడు.
  • అక్షర్ పటేల్ అంతర్జాతీయ క్రికెట్​లో 100 వికెట్లకు ఆరు వికెట్ల దూరంలో ఉన్నాడు.
  • రిషభ్​ పంత్​ అన్ని ఫార్మాట్లలో కలిపి 100 సిక్సర్లు పూర్తి చేసుకోవడానికి మరో 5 సిక్సులు కావాలి.

ఇదీ చదవండి: IND vs SL 2nd Test: 'తుది జట్టు ఎంపిక దానిమీదే ఆధారపడి ఉంది'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.