శ్రీలంకతో జరిగిన తొలి టీ20లో భారత్ 38 పరుగుల తేడాతో గెలుపొందింది. భారత బౌలర్లలో భువనేశ్వర్ కుమార్ నాలుగు వికెట్లు, దీపక్ చాహర్ రెండు వికెట్లతో రాణించారు. దీంతో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో 1-0తో ముందంజ వేసింది ధావన్ సేన.
165 పరుగుల మోస్తారు లక్ష్యంతో బరిలోకి దిగిన లంకకు.. ఫెర్నాండో- మినోద్ భానుక జోడీ 23 పరుగుల భాగస్వామ్యం నమోదు చేసింది. కుదురుకుంటున్నట్లు కనిపించిన ఈ జంటను కృనాల్ విడదీశాడు. అనంతరం బ్యాటింగ్ వచ్చిన డిసిల్వా కూడా స్వల్ప స్కోరుకే వెనుదిరిగాడు. చాహల్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్‌గా పెవిలియన్ చేరాడు. స్కోరు బోర్డులో మరో రెండు పరుగులు కలిశాయో లేదో మరో ఓపెనర్ ఫెర్నాండో భువీ బౌలింగ్‌లో నిష్క్రమించాడు.
అనంతరం క్రీజులోకి వచ్చిన అసలంక దూకుడుగా ఆడే ప్రయత్నం చేశాడు. అతనికి మరో ఎండ్ నుంచి తగిన సహకారం లభించలేదు. తర్వాత వచ్చిన బ్యాట్స్‌మెన్ ఎవరూ ధాటిగా ఆడలేకపోయారు. దీంతో లంక విజయానికి 38 పరుగుల దూరంలో నిలిచిపోయింది.
ఇదీ చదవండి: 'ఒలింపిక్స్‌లో 10 మంది.. పాక్‌కు ఇది సిగ్గుచేటు'