ప్రేమదాస స్టేడియం వేదికగా శ్రీలంకతో జరుగుతోన్న తొలి టీ20లో టీమ్ఇండియా నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. కెప్టెన్ శిఖర్ ధావన్ (46), సూర్యకుమార్ యాదవ్ (50) రాణించారు. లంక బౌలర్లలో హసరంగ రెండు, చమీరా 2, చమీకా ఒక వికెట్ తీసుకున్నారు.
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమ్ఇండియాకు తొలి బంతికే షాక్ తగిలింది. అరంగేట్ర మ్యాచ్ ఆడుతున్న పృథ్వీ షా.. డకౌట్‌గా వెనుదిరిగాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన సంజు శాంసన్.. దూకుడుగా ఆడే ప్రయత్నం చేశాడు. కెప్టెన్ ధావన్‌తో కలిసి రెండో వికెట్‌కు 51 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశాడు. ప్రమాదకరంగా మారుతున్న ఈ జోడీకి హసరంగ చెక్ పెట్టాడు. ఓ అద్భుత బంతితో సంజును వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు.
అనంతరం బ్యాటింగ్‌కు దిగిన సూర్యకుమార్ యాదవ్ దూకుడుగా ఆడాడు. ధావన్‌తో కలిసి మూడో వికెట్‌కు అర్ధ సెంచరీ భాగస్వామ్యం నమోదు చేశాడు. హాఫ్ సెంచరీకి చేరువైన గబ్బర్.. ఓ భారీ షాట్‌కు ప్రయత్నించి కరుణరత్నే బౌలింగ్‌లో వెనుదిరిగాడు. కాసేపటికే 50 పరుగులు పూర్తి చేసుకున్న సూర్య.. తర్వాతి బంతికే ఔటయ్యాడు. తర్వాత వచ్చిన వారిలో ఇషాన్ ఫర్వాలేదనిపించాడు.
ఇదీ చదవండి: 'ఒలింపిక్స్‌లో 10 మంది.. పాక్‌కు ఇది సిగ్గుచేటు'