IND VS SL T20 series Rohith Sharma record: టీ20 ఫార్మాట్‌లో టీమ్‌ఇండియా అదరగొడుతోంది. గతేడాది టీ20 ప్రపంచకప్‌లో పాకిస్థాన్, న్యూజిలాండ్ జట్లతో ఓటముల తర్వాత వరుసగా 11 మ్యాచ్‌లు గెలిచి ఈ ఫార్మాట్‌లో దిగ్విజయంగా ముందుకు సాగుతోంది. ఈ క్రమంలోనే ఐసీసీ ర్యాంకింగ్స్‌లోనూ అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది.
తాజాగా శనివారం రాత్రి ధర్మశాలలో శ్రీలంకతో జరిగిన రెండో టీ20లోనూ భారత్ గెలవడం వల్ల కెప్టెన్ రోహిత్ శర్మ కొత్త రికార్డు నెలకొల్పాడు. స్వదేశంలో అత్యధిక టీ20లు గెలిచిన సారథిగా నిలిచాడు. ఇప్పటివరకు రోహిత్ భారత్‌లో 17 టీ20 మ్యాచ్‌లకు కెప్టెన్సీ చేపట్టగా 16 మ్యాచ్‌లు గెలుపొందాడు. దీంతో ఈ జాబితాలో చెరో 15 విజయాలతో ముందున్న ఇయాన్ మోర్గాన్ (ఇంగ్లాండ్), కేన్ విలియమ్సన్ (న్యూజిలాండ్)లను రోహిత్ అధిగమించాడు.
మరోవైపు టీమ్‌ఇండియా తరఫున అత్యుత్తమ సేవలు అందించిన మాజీ సారథులు విరాట్ కోహ్లీ (13), ధోనీ (11) స్వదేశంలో విజయాలు సాధించారు. ఇక మొత్తంగా రోహిత్ టీమ్‌ఇండియాకు 25 టీ20 మ్యాచ్‌ల్లో కెప్టెన్సీ చేపట్టి 23 విజయాలు అందించాడు. అలాగే పూర్తిస్థాయి కెప్టెన్‌గా వరుసగా మూడు సిరీస్‌లు సాధించాడు. అందులోనూ న్యూజిలాండ్‌పై 3-0, వెస్టిండీస్‌పై 3-0 తేడాలతో వైట్‌వాష్ చేశాడు. ఇక ఈరోజు సాయంత్రం శ్రీలంకతో జరిగే మూడో మ్యాచ్‌లోనూ గెలిస్తే టీమ్‌ఇండియా వరుసగా మూడు సిరీస్‌లు వైట్‌వాష్ చేసిన జట్టుగానూ రికార్డు నెలకొల్పనుంది.
ఇదీ చూడండి: