Ind vs SL: ఆస్ట్రేలియాలో ఈ ఏడాది జరిగే టీ20 ప్రపంచకప్‌నకు బలమైన జట్టును తయారు చేయడమే లక్ష్యంగా.. శ్రీలంకతో టీ20 సిరీస్‌కు భారత్ సిద్ధమైంది. ఇటీవల వెస్టిండీస్‌తో టీ20 సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసిన రోహిత్‌సేన.. గురువారం నుంచి స్వదేశంలో శ్రీలంకతో టీ20 సిరీస్‌లోనూ జోరు కొనసాగించాలని చూస్తోంది. మరో 8 నెలల్లో టీ20 ప్రపంచకప్ ఉన్న నేపథ్యంలో.. జట్టు కూర్పుపై ఈ సిరీస్ ద్వారా ఓ అంచనాకు రావాలని టీమ్ఇండియా భావిస్తోంది.
లంకతో సిరీస్‌లో సాధ్యమైనంత ఎక్కువ మంది ఆటగాళ్లకు అవకాశం ఇవ్వాలని యాజమాన్యం చూస్తోంది. విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్, కేఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్, దీపక్ చాహర్.. గైర్హాజరీతో యువ ఆటగాళ్లకు తుది జట్టులో చోటు దక్కే అవకాశం ఉంది. వెస్టిండీస్‌తో మూడో టీ20లో విఫలమైన.. రుతురాజ్ గైక్వాడ్, శ్రేయస్ అయ్యర్‌లు ఈ సిరీస్‌లో సత్తాచాటాలని పట్టుదలతో ఉన్నారు.
అయ్యర్, బిష్ణోయ్ మరోసారి ఆకట్టుకుంటారా?
వెస్టిండీస్‌తో సిరీస్‌లో ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన వెంకటేశ్ అయ్యర్ ఈ సిరీస్‌లోనూ ఫినిషర్ పాత్రను సమర్ధవంతంగా పోషిస్తే ప్రపంచకప్ జట్టులో చోటు సుస్థిరం చేసుకునే అవకాశం ఉంది. చాలా రోజుల తర్వాత జట్టులోకి వచ్చిన సంజూ శాంసన్.. అవకాశం ఎదురుచూస్తున్నాడు. రవీంద్ర జడేజా రాకతో జట్టు మరింత బలోపేతమైంది.
ఆరంగేట్ర సిరీస్‌తోనే ఆకట్టుకున్న స్పిన్నర్ రవి బిష్ణోయ్.. శ్రీలంకపై కూడా అదే జోరు కొనసాగించాలని భావిస్తున్నాడు. జస్‌ప్రీత్ బుమ్రా మళ్లీ జట్టులోకి రాగా.. భువనేశ్వర్ కుమార్, మహమ్మద్ సిరాజ్‌లతో కూడిన పేస్ దళం.. పటిష్ఠంగా కనిపిస్తోంది.
భారత్‌ను లంక ఎదుర్కోగలదా?
ఇటీవలే ఆస్ట్రేలియాతో 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో 1-4తో శ్రీలంక ఓడిపోయింది. బ్యాటింగ్, బౌలింగ్‌లో.. ఆ జట్టు ఆటగాళ్లు ఆశించిన మేర రాణించలేకపోయారు. కెప్టెన్ దసున్ శనక నేతృత్వంలోని శ్రీలంక జట్టు భారత్‌తో సిరీస్‌లో మంచి ప్రదర్శన చేయాలని పట్టుదలగా ఉంది. కీలక ఆటగాడు హసరంగ.. కరోనా కారణంగా ఈ సిరీస్‌కు దూరమవడం వల్ల ఆ జట్టు బౌలింగ్ బలహీనంగా మారింది!
మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా లఖ్‌నవూలో తొలి మ్యాచ్ జరగనుంది. ఫిబ్రవరి 26, 27 తేదీల్లో ధర్మశాల వేదికగా, మిగతా రెండు మ్యాచ్‌లు జరుగుతాయి. అన్ని మ్యాచ్‌లు రాత్రి 7 గంటలకు ప్రారంభం అవుతాయి.
ఇవీ చూడండి:
Rohit Sharma: ఆ ఫీలింగ్ గొప్పగా ఉంది: రోహిత్ శర్మ
లంకకు భారీ షాక్.. భారత్‌తో సిరీస్‌కు స్టార్ ఆల్‌రౌండర్ దూరం