ETV Bharat / sports

IND vs SL: రాణించిన లంక బ్యాట్స్​మెన్​.. భారత్​ లక్ష్యం 263 - ఇండియా vs శ్రీలంక లైవ్

కొలొంబో వేదికగా జరుగుతోన్న తొలి వన్డేలో శ్రీలంక 50 ఓవర్లలో 262 పరుగులు చేసింది. భారత బౌలర్లలో దీపక్ చాహర్, కుల్దీప్​ యాదవ్​, చాహల్ తలో 2 వికెట్లు తీసుకున్నారు.

india vs sri lanka
ఇండియా vs శ్రీలంక
author img

By

Published : Jul 18, 2021, 6:50 PM IST

Updated : Jul 18, 2021, 7:16 PM IST

కొలొంబో వేదికగా జరుగుతోన్న తొలి వన్డేలో టీమ్ఇండియా ముందు 263 పరుగుల లక్ష్యాన్ని నిలిపింది శ్రీలంక. నిర్ణీత ఓవర్లలో శనక సేన.. 9 వికెట్ల నష్టానికి 262 పరుగులు చేసింది. భారత బౌలర్లలో దీపక్ చాహర్​, కుల్దీప్​ యాదవ్, చాహల్ తలో 2 వికెట్లు తీసుకున్నారు.

ఓపెనర్ల అండతో..

టాస్​ గెలిచి బ్యాటింగ్​ ఎంచుకున్న ఆతిథ్య జట్టుకు ఓపెనర్లు అవిష్క ఫెర్నాండో- మినోద్ భానుక శుభారంభం అందించారు. తొలి వికెట్​కు 49పరుగులు జోడించారు. ప్రమాదకరంగా మారుతున్న ఈ జంటను యుజ్వేంద్ర చాహల్ విడగొట్టాడు. పదో ఓవర్లో బౌలింగ్​కు వచ్చిన యుజీ.. తొలి బంతికే ఫెర్నాండో (32; 35 బంతుల్లో)ను క్యాచ్​ ఔట్​గా పెవిలియన్​ పంపాడు.

అనంతరం క్రీజులోకి వచ్చిన భానుక రాజపక్స(24; 22 బంతుల్లో) మినోద్​ భానుక (27; 44 బంతుల్లో)కు సహకరించాడు. ఈ జోడీ రెండో వికెట్​కు 46 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పింది. భారీ స్కోరు చేసేలా కనిపించిన వీరిద్దరిని ఒకే ఓవర్లో వెనక్కి పంపాడు కుల్దీప్​ యాదవ్​. అప్పటివరకు బాగానే ఉన్న శ్రీలంక రన్​రేట్ ఆ​ తర్వాత పడిపోయింది. చరిత్​ అసలంక(38; 65 బంతుల్లో), దసున్​ శనక(39; 50 బంతుల్లో) ఆచితూచి ఆడారు.

చివర్లో మెరుపులు..

205 పరుగులకు 7 వికెట్లు కోల్పోయిన లంకను చివర్లో కరుణరత్నే, దుశ్మంత చమీరా ఆదుకున్నారు. ముఖ్యంగా కరుణరత్నే(35 బంతుల్లో 43 పరుగులు) చివరి ఓవర్లో విజృంభించాడు. భువీ వేసిన ఆ ఓవర్లో ఏకంగా రెండు సిక్సర్లు బాదాడు. అందులో ఓ సిక్స్​.. ఇన్నింగ్స్​కే హైలైట్​!

వికెట్​ దక్కని భువీ..

పెద్దగా అంచనాలు లేని శ్రీలంక జట్టు బ్యాటింగ్​లో రాణించింది. దాదాపు బ్యాట్స్​మెన్​ అందరూ ఫర్వాలేదనిపించారు. చాహల్​, కుల్దీప్​లకు వికెట్లు పడ్డా.. సీనియర్​ బౌలర్​, వైస్​ కెప్టెన్​ భువనేశ్వర్​ కుమార్​కు ఒక్క వికెట్​ కూడా దక్కకపోవడం అభిమానులను కలవరపెడుతోంది. పైగా అందరికంటే ఎక్కువ ఎకానమీతో 9 ఓవర్లలో 63 పరుగులు​ ఇచ్చాడు భువనేశ్వర్​.

వాట్ ఏ కోఇన్సిడెన్స్​..

భారత్​-శ్రీలంక తొలి వన్డేలో ఓ వింత ఘటన జరిగింది. లంక రెగ్యులర్​ కెప్టెన్​ కుశాల్ పెరీరా గాయం కారణంగా సిరీస్​కు దూరం కాగా.. దసున్​ శనక టీమ్​ను ముందుండి నడిపించాడు. ఇతడు లంక జట్టుకు 25వ కెప్టెన్. అలాగే టీమ్ఇండియాకు సారథ్యం వహించిన శిఖర్​ ధావన్​ కూడా నాయకత్వ బాధ్యతలు చేపట్టిన 25వ ఆటగాడు కావడం విశేషం. ఇక లంక క్రికెటర్​ మినోద్​ భానుక, భారత ఆటగాడు​ ఇషాన్ కిషన్​.. ఆయా జట్లకు 25వ వికెట్​ కీపర్లు కావడం మరో విశేషం.

ఇదీ చదవండి: MS Dhoni: రైనా కిట్​ బ్యాగ్​ను ధోనీ మోసిన వేళ..

Last Updated : Jul 18, 2021, 7:16 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.