శ్రీలంకతో జరిగిన మూడో వన్డేలో స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ (166*)తో పాటు యువ ఆటగాడు శుబ్‌మన్ గిల్ (116) సెంచరీలతో అదరగొట్టారు. దీంతో మూడు వన్డేల సిరీస్‌ను భారత్ క్లీన్‌స్వీప్ చేసేసింది. అయితే ఈ మ్యాచ్‌లో తాను సూపర్ సెంచరీని సాధించడంపై హర్షం వ్యక్తం చేశాడు కోహ్లీ. అలాగే ఈ ఏడాదిలో జరగనున్న వన్డే ప్రపంచకప్‌నకు ముందు ఆటగాళ్లు మంచి ప్రదర్శన ఇవ్వడం బాగుందని అన్నాడు.
"మహమ్మద్ షమీ, సిరాజ్ అద్భుతంగా బౌలింగ్ వేశారు. కొత్త బంతితో ప్రత్యర్థిని కట్టడి చేయడంలో సఫలీకృతులయ్యారు. మరీ ముఖ్యంగా సిరాజ్ పవర్‌ప్లే ఓవర్లలో వికెట్లను తీస్తున్నాడు. ప్రత్యర్థి బ్యాటర్లు ఆచితూచి ఆడేలా చేయడంలో సిరాజ్ సక్సెస్ అయ్యాడు. ప్రపంచకప్ నేపథ్యంలో ఇలాంటి ప్రదర్శన జట్టుకు నైతికంగా బలాన్నిస్తుంది. ఇదో శుభసూచికంగా అనుకోవచ్చు" అని కోహ్లీ పేర్కొన్నారు.
కాగా, 391 పరుగుల విజయలక్ష్యంతో మూడో వన్డేలో బరిలోకి దిగిన శ్రీలంకను సిరాజ్ బేంబేలెత్తించాడు. శ్రీలంక టాప్ ఆర్డర్‌లోని ముగ్గురు ఆటగాళ్లను సిరాజ్ పెవిలియన్‌కు చేర్చాడు. తన పది ఓవర్ల కోటాలో కేవలం 32 పరుగులు మాత్రమే ఇచ్చిన సిరాజ్ నాలుగు వికెట్లను పడగొట్టాడు. ఇన్నింగ్స్ రెండో ఓవర్‌లో అవిష్క ఫెర్నాండోను పెవిలియన్‌కు పంపిన సిరాజ్.. ఆ తర్వాత నాలుగో ఓవర్‌లో కుశాల్ మెండీస్‌ను ఔట్ చేశాడు. నువనిదు ఫెర్నాండోను ఎనిమిదో ఓవర్‌లోను, హసరంగను పదో ఓవర్‌లోను సిరాజ్ పెవిలియన్‌కు పంపించాడు. తన ఆఖరి రెండు ఓవర్లలో ఆ ఐదో వికెట్ కోసం ట్రై చేసినా కసున్ రజిత, లహిరు కుమార ఆ అవకాశం ఇవ్వలేదు. ఇక కోహ్లీ విషయానికొస్తే.. అతడు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌తోపాటు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డులను సొంతం చేసుకొన్నాడు. ముఖ్యంగా ఈ సిరీస్‌లో కోహ్లీ రెండు శతకాలు బాదడం విశేషం.
మొత్తంగా ఈ మూడు వన్డేల సిరీస్‌లో నామమాత్రమైన చివరి మ్యాచ్‌లో టాస్ నెగ్గిన రోహిత్ బ్యాటింగ్ ఎంచుకొన్నాడు. విరాట్, గిల్ శతకాలు సాధించడంతో 50 ఓవర్లలో భారత్ ఐదు వికెట్ల నష్టానికి 390 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనలో 73 పరుగులకే కుప్పకూలింది. ఆ జట్టులో నువనిదు ఫెర్నాండో (19)దే అత్యధిక స్కోరు.
ఇదీ చూడండి: జట్టులో ఉన్న ఆ సమస్యను సిరాజ్ పోగొట్టాడు: రోహిత్