IND Vs SL: క్రికెట్ అభిమానులకు కర్ణాటక రాష్ట్ర క్రికెట్ సంఘం శుభవార్త అందించింది. శ్రీలంకతో టెస్టు సిరీస్లో భాగంగా జరుగనున్న రెండో టెస్టుకు 100శాతం ప్రేక్షకులను అనుమతినిచ్చింది. మార్చి 12 నుంచి మార్చి 16 వరకు బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో డే/నైట్ టెస్టు జరగనుంది.
అంతకుముందు 50 శాతం ప్రేక్షకులకే అనుమతి ఉండగా.. దేశంలో కరోనా అదుపులోకి రావడం వల్ల ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. మిగిలిన టికెట్లను మార్చి 11 నుంచి స్టేడియం వద్దే అందుబాటులో ఉంచనున్నారు.
బెంగళూరు వేదికగా జరుగుతున్న ఈ డేనైట్ టెస్టులో మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ సెంచరీ చేస్తాడని అభిమానులు ఆశిస్తున్నారు. కోహ్లీ చివరిసారిగా 2019లో కోల్కతాలో బంగ్లాదేశ్తో జరిగిన డే/నైట్ మ్యాచ్లోనే సెంచరీ చేశాడు.
అంతకుముందు శ్రీలంకతో మొహాలీలో జరిగిన మొదటి టెస్టులో భారత్ ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్ను మూడు రోజుల్లోనే ముగించిన టీమ్ఇండియా 1-0తో ఆధిక్యంలో ఉంది.
ఇదీ చూడండి: రోహిత్ నోరు జారి ఉంటాడు: పాక్ మాజీ క్రికెటర్